Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: ‘మీ గుండె ఎప్పుడూ తెలంగాణ కోసమే కొట్టుకుంటుంది’.. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ప్రకాష్‌ రాజ్‌ ప్రశంసలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అదే సమయంలో సుమారు పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు.

Telangana Elections: 'మీ గుండె ఎప్పుడూ తెలంగాణ కోసమే కొట్టుకుంటుంది'.. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ప్రకాష్‌ రాజ్‌ ప్రశంసలు
Prakash Raj, KCR
Follow us
Basha Shek

| Edited By: Subhash Goud

Updated on: Dec 03, 2023 | 9:36 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారం చేపడుతామనకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటమితో నిరాశలో కూరుకుపోయాయి. బీఆర్‌ఎస్‌ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ కు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అదే సమయంలో సుమారు పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్‌ ఆర్జీవీ, స్టార్‌ యాంకర్‌ అనసూయ, సందీప్‌ కిషన్‌, నిఖిల్ కేటీఆర్‌కు సపోర్టుగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ బీఆర్‌ఎస్‌ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ ఇది చాలా బాధ కలిగించింది. అయినా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు కంగ్రాట్స్. కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏది ఏమైనా మేమంతా మీ వెంటే ఉంటాం. మీ గుండె ఎప్పుడూ తెలంగాణ కోసమే కొట్టుకుంటుందని మాకు తెలుసు’ అని ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఇక ఎప్పటిలాగే ‘ట్రోలర్స్‌కు ఆహ్వానం’ అంటూ ఫైనల్‌ పంచ్‌ ఇచ్చారీ సీనియర్‌ నటుడు.

ఇవి కూడా చదవండి

ప్రకాష్ రాజ్ ట్వీట్..

తెలంగాణలో ఎన్నికల ఫలితాలిలా..

మొత్తం 119 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ కేవలం 39 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఎనిమిది స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు. కేసీఆర్‌ గజ్వేల్‌లో విజయం సాధించగా, కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్ :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్ :

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.