- Telugu News Photo Gallery Cinema photos Rashmika mandanna and mrunal thakur in Hero Vijay Devarakonda family star movie Update Telugu Entertainment Photos
Vijay Devarakonda – Family Star: ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వయా రష్మిక మందన్న.!
ఏ సినిమా తీసుకున్నా ఏమున్నది గర్వకారణం.. అన్నిచోట్లా ఉన్నదదే లీకుల పర్వం అన్నట్లు మారిపోయిందిప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి. పెద్దా చిన్నాతో పని లేదు.. అన్ని సినిమాలకి లీకుల బెడద తప్పట్లేదు. తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ను ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనివల్ల బయటకు రాకూడని సీక్రేట్స్ కొన్ని బయటికొచ్చేస్తున్నాయి. మరి అవేంటి..? ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు.. వాటిని దాచుకోవడమే కష్టమైపోతుంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 03, 2023 | 11:26 PM

ఏ సినిమా తీసుకున్నా ఏమున్నది గర్వకారణం.. అన్నిచోట్లా ఉన్నదదే లీకుల పర్వం అన్నట్లు మారిపోయిందిప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి. పెద్దా చిన్నాతో పని లేదు.. అన్ని సినిమాలకి లీకుల బెడద తప్పట్లేదు.

తాజాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ను ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. దీనివల్ల బయటకు రాకూడని సీక్రేట్స్ కొన్ని బయటికొచ్చేస్తున్నాయి. మరి అవేంటి..? ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు.. వాటిని దాచుకోవడమే కష్టమైపోతుంది.

ముఖ్యంగా ఏ హీరో సినిమానైనా కూడా లీకులు బాగా వెంటాడుతున్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు ఇది తప్పట్లేదు. తాజాగా ఆయన ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఓ సీన్ లీక్ అయిపోయిందనే ప్రచారం జరుగుతుంది.

దానివల్ల రాకూడని సీక్రేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ మధ్య గుంటూరు కారం, గేమ్ ఛేంజర్ పాటలు ముందుగానే లీక్ అయ్యాయి. అలాగే మరికొన్ని సినిమాలకు ఇదే జరిగింది. తాజాగా ఫ్యామిలీ స్టార్‌కు సంబంధించిన ఓ పాట క్లిప్ వీడియో లీక్ అయింది.

పెళ్లి సందర్భంలో వచ్చే ఈ పాటను ఢిల్లీలో చిత్రీకరించారు మేకర్స్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌తో పాటు ఇందులో రష్మిక మందన్న కనిపించడంతో రౌడీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఫ్యామిలీ స్టార్‌లో రష్మిక ఉందనే విషయంపై చాలా రోజులుగా చర్చ జరుగుతున్నా.. సాక్ష్యం లేదు.

ఇప్పుడీ లీక్ పుణ్యమా అని ఆ క్లారిటీ వచ్చింది. రష్మిక క్యామియో విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా.. చిన్న లీక్‌తో అసలు విషయం లీకైపోయింది. ఈ విషయాన్ని ఫ్యామిలీ స్టార్ టీం సీరియస్‌గా తీసుకుంటుందా లేదా చూడాలి.

డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఫలితాలతో డీలా పడిన విజయ్ కెరీర్‌కు పూర్తిగా కాదు కానీ.. కాస్త ఊరటనిచ్చింది ఖుషి. ఫ్యామిలీ కథల్లో రౌడీ బాయ్‌ను చూడ్డానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారని దీని వసూళత్లే చెప్తున్నాయి.

పైగా గీతా గోవిందం కాంబినేషన్ కావడం ఫ్యామిలీ స్టార్‌కు కలిసొచ్చే విషయం. ముందు సంక్రాంతికి అనుకున్నా.. అనుకోని కారణాలతో మరో డేట్‌కు వెళ్తుందనే ప్రచారం జరుగుతుంది.





























