- Telugu News Photo Gallery Cinema photos Chiranjeevi , yash and mahesh babu waiting for next movie offers in Tollywood Telugu Entertainment Photos
Chiranjeevi – Yash – Mahesh Babu: పార్టీ మార్చిన చిరు.. కంటిన్యూ అవుతున్న మహేష్, యష్.!
ఒక్కో హీరోకీ లైనప్‌లో బోలెడన్ని సినిమాలు. అందుకే స్టార్ల కాల్షీట్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయా? ఎప్పుడెప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూసే కెప్టెన్లే మనదగ్గర కోకొల్లలు. బట్, కొన్నిసార్లు ఊహాతీతంగా కొన్ని జరుగుతుంటాయి. డైరక్టర్ల కోసం హీరోలు వెయిట్ చేస్తుంటారు. పర్సన్ కోసమా? ప్రాజెక్ట్ కోసమా? అనే లెక్కలు అక్కడ కనిపించవు. హీరోలు వెయిటింగ్‌లో ఉన్నారా? లేదా? అదొక్కటే మీనింగ్‌ఫుల్‌గా అనిపించే మాట.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Dec 03, 2023 | 11:47 PM

ఒక్కో హీరోకీ లైనప్‌లో బోలెడన్ని సినిమాలు. అందుకే స్టార్ల కాల్షీట్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయా? ఎప్పుడెప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేద్దామా అని ఎదురుచూసే కెప్టెన్లే మనదగ్గర కోకొల్లలు. బట్, కొన్నిసార్లు ఊహాతీతంగా కొన్ని జరుగుతుంటాయి. డైరక్టర్ల కోసం హీరోలు వెయిట్ చేస్తుంటారు. పర్సన్ కోసమా? ప్రాజెక్ట్ కోసమా? అనే లెక్కలు అక్కడ కనిపించవు. హీరోలు వెయిటింగ్‌లో ఉన్నారా? లేదా? అదొక్కటే మీనింగ్‌ఫుల్‌గా అనిపించే మాట.

బాస్ పార్టీని ఇయర్ స్టార్టింగ్‌లోనే ఫుల్లుగా ఎంజాయ్ చేసేశారు మెగా ఫ్యాన్స్. మెగాస్టార్ మాస్‌గా ట్రై చేయాలేగానీ, హిట్ చేయడానికి మేం ఉన్నామంటూ సపోర్ట్ చేశారు. వాల్తేరు వీరయ్యకు అందిన ఆ అభిమానం, భోళా శంకర్‌కి దక్కలేదు.

ఆ విషయం అర్థం చేసుకున్న చిరంజీవి కొన్నాళ్ల పాటు సైలెంట్ అయ్యారు. బింబిసార ఫేమ్ వశిష్ట లైన్‌లోకి వచ్చేవరకు వెయిట్ చేశారు. ఇప్పుడు బాస్ వెయిటింగ్ ఓవర్. మారేడుమిల్లిలో యమా స్పీడ్‌గా జరుగుతోంది షూటింగ్.

గతేడాది చూసిన సర్కారువారి పాటనే మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ ఏడాదిని మిస్ చేసుకున్నారు మహేష్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం బరిలోకి దూకుతోంది. 2023లో ఫ్యాన్స్ మిస్ అయిన మీల్స్ ని కడుపునిండా పెట్టేస్తామని అంటున్నారు మేకర్స్.

గుంటూరు కారం తర్వాత మళ్లీ మహేష్ ఆన్ లొకేషన్‌లో ఎప్పుడు అడుగుపెడతారనే క్లారిటీ లేదు. రాజమౌళిని అడిగితే.. చాలా టైమ్ ఉందంటూ దాటేశారు. సో.. జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు సూపర్‌స్టార్ రెస్ట్ మోడ్ ఆన్ అయ్యే ఉంటుందన్నమాట.

ఆల్రెడీ సౌత్ నుంచి ఇలాంటి వెయిటింగ్‌నే టేస్ట్ చేస్తున్నారు రాక్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ ఎప్పుడెప్పుడు పిలుస్తారా? అని ఓపిగ్గా ఉన్నారు. ఇంకెన్నాళ్లు రాకీభాయ్ అని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే... నేనేం ఖాళీగా లేను.

సగం వండిన అన్నాన్ని మీకు వడ్డించలేను అని ఆన్సర్ చేస్తున్నారు. రాకీ భాయ్ ఫ్యాన్స్ కోసం మీల్స్ రెడీ చేయడానికి కెప్టెన్లు ఇంకెన్నాళ్లు తీసుకుంటారన్నది ప్రస్తుతానికి థౌజండ్ డాలర్ల క్వశ్చనే.