- Telugu News Photo Gallery Cinema photos Senior star heroes acting with young heroes is a new trend in industry
Young heroes: యంగ్ హీరోలతో సీనియర్ స్టార్ హీరోస్.. ఇదే నయా ట్రెండ్..
మార్కెట్ పరంగా యంగ్ జనరేషన్‌తో పోలిస్తే సీనియర్ హీరోలు కాస్త వెనకబడుతున్నారు. అందుకే పోటి నిలబడాలంటే కుర్ర హీరోల హెల్ప్ కావాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. కథ పరంగానో, బిజినెస్ పరంగానో సినిమాలకు హెల్ప్ అయ్యేలా కాంబినేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది.
Updated on: Dec 04, 2023 | 11:12 AM

మార్కెట్ పరంగా యంగ్ జనరేషన్‌తో పోలిస్తే సీనియర్ హీరోలు కాస్త వెనకబడుతున్నారు. అందుకే పోటి నిలబడాలంటే కుర్ర హీరోల హెల్ప్ కావాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. కథ పరంగానో, బిజినెస్ పరంగానో సినిమాలకు హెల్ప్ అయ్యేలా కాంబినేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ట్రెండ్ నడుస్తోంది.

రీసెంట్‌గా జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ వరుసగా రెండు సినిమాలు లైన్‌లో పెట్టేశారు. అందులో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు డబుల్ చేసే అప్‌డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ శివ కార్తికేయన్ కీ రోల్‌లో నటిస్తున్నారు.

రజనీ మాత్రమే కాదు అదే జనరేషన్ హీరో కమల్ కూడా కుర్ర హీరోలతో మింగిల్ అవుతున్నారు. మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన విక్రమ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న కమల్, నెక్ట్స్ కల్కి 2898 ఏడీలో ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, కమల్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు హోల్ ఇండియా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.

ఇలాంటి కాంబోస్‌ను మలయాళ ఇండస్ట్రీ ఎప్పుడో మొదలు పెట్టింది. కుర్ర హీరోలతో వరుస సినిమాలు చేస్తూ మాలీవుడ్‌ను మిగతా ఇండస్ట్రీలకు టార్చర్ బేరర్‌లా నిలబెడుతున్నారు టాప్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్.

మన మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు మల్టీ స్టారర్‌ల వైపే అడుగులు వేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న చిరు, తరువాత వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించారు. రీసెంట్‌గా భోళా శంకర్‌లోనూ సుశాంత్‌తో కలిసి ఆడిపాడారు మెగాస్టార్. అప్ కమింగ్ సినిమాల్లోనూ అలాంటి కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు.