Daggubati Abhiram: వెంకీ ఇంట్లో పెళ్లి సందడి.. దగ్గుబాటి యంగ్ హీరో డెస్టినేషన్ వెడ్డింగ్ ?..

దగ్గుబాటి అభిరామ్‏కు కాబోయే భార్య పేరు ప్రత్యూష. ఆమెది కారంచేడు. ప్రత్యూష కుటుంబం దగ్గుబాటి ఫ్యామిలీకి సన్నిహితులు అని సమాచారం. వీరిద్దరి వివాహం డిసెంబర్ 6న శ్రీలంకలోని ఓ రిసార్ట్‏లో ఘనంగా జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు 200 మంది వరకు అతిథులకు అతిథ్యం ఇచ్చే రిసార్ట్ ఎంచుకున్నారని తెలుస్తోంది.

Daggubati Abhiram: వెంకీ ఇంట్లో పెళ్లి సందడి.. దగ్గుబాటి యంగ్ హీరో డెస్టినేషన్ వెడ్డింగ్ ?..
Daggubati Abhiram
Follow us

|

Updated on: Dec 03, 2023 | 7:37 PM

విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లి భజాలు మోగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత సురేష్ బాబు దగ్గుబాటి చిన్న కుమారుడు అభిరామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ న్యూస్ పై ఇప్పటివరకు వెంకీ కానీ.. దగ్గుబాటి కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో అభిరామ్ పెళ్లి నిజమేనని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ యంగ్ హీరో వివాహం విషయం తెరపైకి వచ్చింది. కొద్దిరోజుల్లోనే అభిరామ్ పెళ్లి ఘనంగా జరగబోతుందని సమాచారం. మూడు రోజులపాటు రానా తమ్ముడి వివాహం జరగనుందంట. అయితే ఈ వేడుక భారతదేశంలో మాత్రం కాదని టాక్. ఎవరూ ఊహించని ఓ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇంతకీ అభిరామ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ? ఎక్కడ వివాహం జరగనుందో తెలుసా? . పెళ్లి విశేషాలను తెలుసుకుందాం.

దగ్గుబాటి అభిరామ్‏కు కాబోయే భార్య పేరు ప్రత్యూష. ఆమెది కారంచేడు. ప్రత్యూష కుటుంబం దగ్గుబాటి ఫ్యామిలీకి సన్నిహితులు అని సమాచారం. వీరిద్దరి వివాహం డిసెంబర్ 6న శ్రీలంకలోని ఓ రిసార్ట్‏లో ఘనంగా జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. దాదాపు 200 మంది వరకు అతిథులకు అతిథ్యం ఇచ్చే రిసార్ట్ ఎంచుకున్నారని తెలుస్తోంది. సోమవారం దగ్గుబాటి కుటుంబసభ్యులతోపాటు అతిథులు సైతం శ్రీలంకకు చేరుకోనున్నారని తెలుస్తోంది. అభిరామ్, ప్రత్యూష వివాహం దాదాపు మూడు రోజులపాటు జరగనుందట. సోమవారం రాత్రి 8.30 గంటలకు డిన్నర్ పార్టీతో వేడుకలు ప్రారంభంకాగా.. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మెహందీ వేడుక జరగనుందట. ఇక బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి కూతురు చేయడం నుంచి రాత్రి 7 గంటలకు వీరి వివాహం జరగనుందని సమాచారం. రాత్రి 8.50 నిమిషాలకు వివాహ సుముహుర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ని నిర్వహించాలని దగ్గుబాటి ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే.. సురేష్ బాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రానా కాగా.. చిన్న కుమారుడు అభిరామ్. ఇప్పటికే ఇండస్ట్రీలో రానా హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అభిరామ్… ఇటీవలే అహింస సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తానని ఇటీవలే ప్రకటించాడు అభిరామ్. ఇక ఇప్పుడు పెళ్లితో బ్యాచిలర్ లైఫ్‏కు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు