Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీని రైతుల కుటుంబాలకే ఇచ్చేస్తా: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌

బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత, రన్నరప్‌, టాప్‌-5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తిగా మారింది. వీటిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కూడా జరుగుతోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేయనున్నారు హోస్ట్‌ నాగార్జున. టైటిల్ విజేతకు సుమారు 50 లక్షలతో పాటు ఓ కారు, జోయాలుక్కాస్ 15లక్షల ప్రైజ్‌మనీనీ ప్రకటించే అవకాశాలున్నాయి.

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీని రైతుల కుటుంబాలకే ఇచ్చేస్తా: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 03, 2023 | 10:13 PM

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సెలబ్రిటీ రియాలిటీ షో ముగియనుందని తెలుస్తోంది. డిసెంబర్‌ 17న బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే జరగనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవనున్నాడని తెలుస్తోంది. అంటే హౌజ్‌లో మిగిలిదే ఉండేది ఏడుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే. ఇక వీరితోనే గ్రాండ్‌ ఫినాలే నిర్వహించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేత, రన్నరప్‌, టాప్‌-5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తిగా మారింది. వీటిపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కూడా జరుగుతోంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేయనున్నారు హోస్ట్‌ నాగార్జున. టైటిల్ విజేతకు సుమారు 50 లక్షలతో పాటు ఓ కారు, జోయాలుక్కాస్ 15లక్షల ప్రైజ్‌మనీనీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ ప్రైజ్‌మనీతో ఎవరేం చేయనున్నారు? అని నాగార్జున హౌజ్‌ మేట్స్‌ను అడిగాడు. ఈ నేపథ్యంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రైతుల కోసం.. చనిపోయిన రైతు కుటుంబాల కోసం, వారి పిల్లల కోసం ఆ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తాను అని రైతు బిడ్డ చెప్పుకొచ్చాడు. ప్రశాంత్‌ నిర్ణయాన్ని హోస్ట్‌ నాగార్జునతో పాటు హౌజ్‌మేట్స్‌ అందరూ మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌గా మారింది.

అభిమానులు, నెటిజన్లు కూడా పల్లవి ప్రశాంత్‌ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. రైతుబిడ్డ తన మూలాలను మరవకుండా మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ పల్లవి ప్రశాంత్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసులో దూసుకుపోతున్నాడు పల్లవి ప్రశాంత్‌. అతనికి శివాజీ, అమర్‌ దీప్‌ గట్టి పోటీనిస్తున్నారు. ఇక బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లోనూ దూసుకెళుతున్నాడు రైతు బిడ్డ. సామాజిక మాధ్యమాల్లోనూ రైతు బిడ్డ పేరు మార్మోగిపోతోంది. సొహైల్‌ లాంటి బిగ్‌ బాస్‌ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు పల్లవి ప్రశాంత్‌ కు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఉల్టా పుల్టా అంటూ ఎప్పటికప్పుడు సర్‌ ప్రైజ్‌లిస్తోన్న బిగ్‌ బాస్‌ ఈసారి విజేతగా ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో