Guess The Actor: సినిమా కోసం 15 కిలోలు తగ్గిపోయిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? ఆస్కార్‌ బరిలో ఉన్నాడు

పై ఫొటోలో డీగ్లామర్‌గా కనిపిస్తోన్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? అతనిని హీరో అనడం కంటే నటుడు అని పిలవడమే కరెక్ట్‌. వెర్సటైల్‌ యాక్టర్‌ గా గుర్తింపు తెచ్చుచ్చుకున్న అతను పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోతాడు. వైవిధ్యమైన కథల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. అందుకే అతని సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అన్నట్లు అతను కేవలం నటుడే కాదు మంచి అభిరుచి గల నిర్మాత. సింగర్‌గానూ సత్తాచాటాడు. మరి ఈ నటుడెవరో గుర్తుపట్టారా?

Guess The Actor: సినిమా కోసం 15 కిలోలు తగ్గిపోయిన స్టార్‌ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? ఆస్కార్‌ బరిలో ఉన్నాడు
Actor
Follow us
Basha Shek

|

Updated on: Dec 05, 2023 | 10:05 PM

పై ఫొటోలో డీగ్లామర్‌గా కనిపిస్తోన్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? అతనిని హీరో అనడం కంటే నటుడు అని పిలవడమే కరెక్ట్‌. వెర్సటైల్‌ యాక్టర్‌ గా గుర్తింపు తెచ్చుచ్చుకున్న అతను పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోతాడు. వైవిధ్యమైన కథల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. అందుకే అతని సినిమాలకు సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అన్నట్లు అతను కేవలం నటుడే కాదు మంచి అభిరుచి గల నిర్మాత. సింగర్‌గానూ సత్తాచాటాడు. మరి అతనెవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. అతను లేటెస్ట్‌గా నటించిన ఓ పాన్‌ ఇండియా సినిమా ఆస్కార్‌-2023 నామినేషన్స్‌కు వెళ్లింది. దీంతో అతని పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఇందులో ఉన్నది మరెవరో కాదు మలయాళ స్టార్‌ హీరో టొవినో థామస్‌. మిన్నల్‌ మురళి, తుళ్లుమాల, 2018 సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఫేవరెట్‌గా మారిపోయాడు టొవినో. ముఖ్యంగా 2018 సినిమా చాలామందికి ఫేవరెట్‌. ఇందులో అతని అభినయాన్ని చూస్తే ఎవరైనా కన్నీరు పెట్టుకోవాల్సిందే. సినిమాలో స్ట్రాంగ్‌ కంటెంట్‌ ఉండడంతో 2018 మూవీ ఆస్కార్‌- 2023 బరిలో కూడా నిలిచింది.

టొవినో థామస్‌ నటించిన తాజా చిత్రం ‘అదృశ్య జలకంగళ్’. వార్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాలో టొవినో థామస్‌ డీ గ్లామర్ రోల్ చేశాడు. నవంబర్‌ 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించడం విశేషం. బిగ్‌ స్క్రీన్‌ పై హిట్‌గా నిలిచిన ‘అదృశ్య జలకంగళ్ త్వరలోనే ఓటీటీలోకి కూడా రానుంది. ఈ సినిమా కోసం ఏకంగా 15 కిలోలు తగ్గిపోయాడు.

ఇవి కూడా చదవండి

అక్షయ్ కుమార్ తో టొవినో థామస్

ఆస్కార్ బరిలో 2018

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.