Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ విన్నర్‏కు బంపర్ ఆఫర్.. రూ.50 లక్షలతో ఇంకా ఏమి ఇవ్వనున్నారంటే..

చివరి వారం అర్జున్ మినహా.. మిగతా ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. ఇక ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో ఓటింగ్ సైతం స్టార్ట్ కాగా... తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేసే పనిలో పడ్డారు అడియన్స్. అయితే ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉంటారు అనే చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియా లెక్కల ప్రకారం అయితే ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, ప్రియాంక, యావర్ టాప్ లో ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వారం మిడిల్ ఎలిమినేషన్ ఉండనుందనే టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ విన్నర్‏కు బంపర్ ఆఫర్.. రూ.50 లక్షలతో ఇంకా ఏమి ఇవ్వనున్నారంటే..
Bigg Boss 7 Telugu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2023 | 2:05 PM

బిగ్‏బాస్ సీజన్ 7 ముగింపుకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షో.. ఇప్పుడు ఏడుగురు మాత్రమే మిగిలారు. ఇక నిన్నటి ఎపిసోడ్‎లో లాస్ట్ నామినేషన్స్ ప్రక్రియ హీటెక్కాయి. చివరి వారం అయినా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మొదటి వారం ఓ రేంజ్‏లో వాదించుకున్న అమర్ దీప్, ప్రశాంత్.. ఇప్పుడు లాస్ట్ వీక్‏లోనూ మాటలతో రెచ్చిపోయారు. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. ఇక చివరి వారం అర్జున్ మినహా.. మిగతా ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. ఇక ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో ఓటింగ్ సైతం స్టార్ట్ కాగా… తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేసే పనిలో పడ్డారు అడియన్స్. అయితే ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఎవరెవరు ఉంటారు అనే చర్చ నడుస్తోంది. ఇక సోషల్ మీడియా లెక్కల ప్రకారం అయితే ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ, ప్రియాంక, యావర్ టాప్ లో ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వారం మిడిల్ ఎలిమినేషన్ ఉండనుందనే టాక్ వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు బిగ్‏బాస్ సీజన్ 7 విన్నర్ ఫ్రైజ్ మనీ గురించి నెట్టింట ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. ఈ సీజన్ విజేతకు రూ.50 లక్షలతోపాటు.. ఓ బ్రేజా కార్, జాయ్ అలుక్కాస్ నుంచి రూ.15 లక్షలు అందించనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు హైదరాబాద్ ఏరియాలోనే ఓ ఫ్లాట్ కూడా ఇవ్వనున్నారట. దీంతో బిగ్‏బాస్ సీజన్ 7 విజేతకు అటు ఇటుగా రూ.90 నుంచి కోటి రూపాయాల వరకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం యావర్, ప్రశాంత్, అమర్, శివాజీ, ప్రియాంక, శోభా శెట్టి నామినేషన్స్‏లో ఉన్నారు. దీంతో SPA, SPY బ్యాచ్‏ మధ్య హోరా హోరీగా పోటీ ఉండనుంది.

గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచే నాగార్జున ఆసక్తిని కలిగించారు. ఇక ముందు 14 మందిని హౌస్ లోకి పంపించారు. ఆ తర్వాత ఐదు వారాలలో ఒక్కొక్కరు ఎలిమినేట్ కాగా.. మరో ఐదుగురిని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా పంపించారు. కానీ ఎప్పటిలాగే ఎలిమినేషన్స్ మాత్రం ప్రేక్షకులు ఊహించినట్లుగా జరిగినా.. ఆరో వారం నుంచి అంతా తారుమారు చేసేశారు. నిజానికి ఆరోవారం అందరికంటే తక్కువగా శోభాకు ఓటింగ్ రాగా.. ఆమె స్థానంలో నయని పావని ఎలిమినేట్ చేశారు.

ఇక తర్వాత పలు వారాల్లోనూ అందరి కంటే తక్కువ ఓటింగ్ శోభాకు వచ్చినప్పటికీ అనుహ్యంగా ఆమెను సేవ్ చేస్తూ మరో ఇంటిసభ్యుడిని బలి చేస్తున్నారు. గతవారం ఓటింగ్ లో శోభా చివరి స్థానంలో ఉండగా.. ప్రశాంత్ మొదటి స్థానంలో.. అమర్ రెండవ స్థానంలో.. శివాజీ మూడవ స్థానంలో.. గౌతమ్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాత అర్జున్, యావర్, ప్రియాంక, శోభా ఉండగా.. అనుహ్యంగా గౌతమ్‏ను ఎలిమినేట్ చేశారు. ఇక ఈ వారంలో ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ చూస్తే శోభా, ప్రియాంక చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు