CID Actor: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు దినేష్ కన్నుమూత..

ఇటీవల కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన దినేష్.. అప్పటినుంచి కాలేయానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో సోమవారం అర్ధరాత్రి 12.08 నిమిషాలకు దినేష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీఐడీ నటుడు దయనంద్ శెట్టి ధృవీకరించారు. ఈరోజు (మంగళవారం) ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్ లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

CID Actor: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు దినేష్ కన్నుమూత..
Cid Dinesh Phadnis
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 05, 2023 | 12:41 PM

సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన సీఐడీ సీరియల్ నటుడు దినేష్ ఫడ్నిస్ సోమవారం (డిసెంబర్ 4) రాత్రి కన్నుమూశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన దినేష్.. అప్పటినుంచి కాలేయానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో సోమవారం అర్ధరాత్రి 12.08 నిమిషాలకు దినేష్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీఐడీ నటుడు దయనంద్ శెట్టి ధృవీకరించారు. ఈరోజు (మంగళవారం) ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్ లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దినేష్ మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

డిసెంబరు 2 నుండి దినేష్ ఫడ్నిస్‏కు వైధ్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. అయితే దినేష్ గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారని పలు సోషల్ మీడియాలో వార్తలు రాగా.. సీఐడీ నటుడు దయానంద్ శెట్టి.. ఫడ్నిస్‌కు గుండెపోటు రాలేదని స్పష్టం చేశారు. “దినేష్ ఫడ్నిస్ గుండెపోటుతో బాధపడలేదని.. అతడి ఆరోగ్య పరిస్థితి, చికిత్స గురించి చెప్పడం మాట్లాడడం తనకు ఇష్టం లేదు ” అన్నారు. దయానంద్ శెట్టి CIDలో సీనియర్ ఇన్స్పెక్టర్ దయా పాత్రను పోషించారు.

ప్రముఖ డిటెక్టివ్ షో CID 1998లో టెలివిజన్‌లో ప్రారంభమైన ఈ షో 2018వరకు కొనసాగింది. దాదాపు 20 ఏళ్లపాటు ఈ షో విజయవంతంగా ప్రసారమయ్యింది. ఇందులో దాదాపు 20ఏళ్లపాటు దినేష్ భాగమయ్యాడు. ఇందులో ఫ్రెడరిక్స్ (ప్రణీత్) అనే పాత్రలో నటించాడు. ఇందులో తన నటన, కామెడీ టైమింగ్‏తో ప్రేక్షకులను అలరించాడు దినేష్. ముఖ్యంగా ACP ప్రద్యుమాన్‌తో దినేష్ కామెడీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. కేవలం సీఐడీ మాత్రమే కాకుండా కొన్ని ఎపిసోడ్‏లకు రచనా సహాకారం అందించాడు దినేష్. అలాగే వెండితెరపై సర్ఫరోష్, సూపర్ 30 చిత్రాలలో కూడా కనిపించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.