Saptha Sagaralu Dhaati Side B OTT: ఓటీటీలోకి ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ.. రక్షిత్ శెట్టి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బ్యూటిఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ రెండు పార్టులుగా వచ్చింది. సప్త సాగరాలు దాటి సైడ్‌ ఏ ఇప్పటికే రిలీజైంది. అటు థియేటర్లు, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీకి కొనసాగింపుగా సప్త సాగరాలు దాటి సైడ్‌ బి తెరకెక్కింది. నవంబర్‌ 17న కన్నడతో పాటు తెలుగులో ఒకేసారి థియేటర్లలో రిలీజైంది.

Saptha Sagaralu Dhaati Side B OTT: ఓటీటీలోకి ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ.. రక్షిత్ శెట్టి మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Saptha Sagaralu Dhaati Side B Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 06, 2023 | 4:23 PM

చార్లీ 777 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఫేవరెట్‌ యాక్టర్‌గా మారిపోయాడు కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి. అతను నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యి సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అందులో సప్త సాగరాలు దాటి (కన్నడలో సప్త సాగరాలు దాచె ఎల్లో) ఒకటి. బ్యూటిఫుల్‌ అండ్‌ ఎమోషనల్‌ ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీ రెండు పార్టులుగా వచ్చింది. సప్త సాగరాలు దాటి సైడ్‌ ఏ ఇప్పటికే రిలీజైంది. అటు థియేటర్లు, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీకి కొనసాగింపుగా సప్త సాగరాలు దాటి సైడ్‌ బి తెరకెక్కింది. నవంబర్‌ 17న కన్నడతో పాటు తెలుగులో ఒకేసారి థియేటర్లలో రిలీజైంది. మొదటి పార్ట్‌ లాగే రెండో భాగానికి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ఇప్పుడీ బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ రక్షిత్‌ శెట్టి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 15న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సప్త సాగరాలు దాటి సైడ్‌ బి సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

స‌ప్తసాగ‌రాలు దాటి సైడ్ బీ లో సినిమాలో ర‌క్షిత్ శెట్టి సరసన రుక్మిణ్ వ‌సంత్ హీరోయిన్‌గా నటించింది. చైత్ర జె.ఆచార్‌, ర‌మేశ్ ఇందిర‌, అచ్యుత్ కుమార్, గోపాలకృష్ణ దేశపాండే త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు. హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడం విశేషం. చరణ్ రాజ్ అందించిన పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ప్రియ (రుక్మిణీ వసంత్‌) ప్రేమ కోసం మ‌ను జైలుకు వెళ్లడంతో స‌ప్తసాగరాలు దాటి సైడ్ ఏ సినిమా ముగుస్తుంది. పదేళ్ల తర్వాత జైలు శిక్ష అనుభవించిన మను విడుదల కావడంతో రెండో పార్ట్‌ ప్రారంభమవుతుంది. మరి తనను జైలుకు పంపించిన వారిపై మను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అదే సమయంలో ప్రియ కలలను ఆమెకు తెలియకుండా ఎలా నెరవేర్చాడన్నది తెలుసుకోవాలంటే స‌ప్తసాగ‌రాలు దాటి సైడ్ బి సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

స‌ప్తసాగ‌రాలు దాటి సైడ్ బి ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..