Animal Movie: ‘యానిమల్’ పెద్ద డిజాస్టర్.. 3 గంటలు టైం వేస్ట్.. టీమిండియా క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన యానిమల్ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గత రికార్డులు బద్దలు కొడుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, రేణు దేశాయ్, త్రిష వంటి సినీ ప్రముఖులు రణ్ బీర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తు్న్నారు. అదే సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మహిళలను తక్కువ చేసి చూపించారంటూ కొందరు సెలబ్రిటీలు యానిమల్ సినిమాపై పెదవి విరుస్తున్నారు.
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీని తెరకెక్కించారు. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన యానిమల్ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ వద్ద గత రికార్డులు బద్దలు కొడుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, రేణు దేశాయ్, త్రిష వంటి సినీ ప్రముఖులు రణ్ బీర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తు్న్నారు. అదే సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మహిళలను తక్కువ చేసి చూపించారంటూ కొందరు సెలబ్రిటీలు యానిమల్ సినిమాపై పెదవి విరుస్తున్నారు. సందీప్ తీసిన అర్జున్ రెడ్డి, కబీర్ సినిమాల్లోనూ స్త్రీలను ద్వేషిస్తూ చూపించారంటూ మండి పడుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనాద్కత్ యానిమల్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాను చూసి 3 గంటలు టైమ్ వేస్ట్ చేసుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జయ దేవ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
‘మనమేమీ అడవుల్లో ఉండటం లేదు. యుద్ధాలు చేస్తూ వేటాడే సమాజంలో జీవించడం లేదు. నటన ఎంత బాగా ఉన్నా సరే కుటుంబ బంధాలను ఇలా మితిమీరిన హింసతో చూపించడం తగదు. ఇలాంటి హింసను ప్రేరేపించే సినిమాల్ని ఆదరిస్తూ ప్రశంసలు కురిపించడం మంచిదికాదు. లక్షలాది మంది సామాన్యులు సినిమాలు చూస్తుంటారు. ఎంటర్ టైన్మెంట్‌ఇండస్ట్రీకి ఒక సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. యానిమల్ సినిమా చూసి నా మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నందుకు బాధగా ఉంది’ ఇన్ స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు జయదేవ్ ఉనాద్కత్. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. మరి దీనిపై యానిమల్ మూవీ టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
యానిమల్ సినిమాపై జయదేవ్ పోస్ట్
#JaydevUnadkat 🔥👌 #AnimalDisaster #DisasterAnimal pic.twitter.com/0pMD200A6o
— Raghuvaran (@raghuvaranBE) December 3, 2023
ఇలాంటి సినిమాలు ఎలా హిట్ చేస్తున్నారో
शांतराम की – औरत , गुरुदुत्त की – साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की – अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा
— Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023
యానిమల్ టీమ్ కౌంటర్..
Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes…. now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI
— Animal The Film (@AnimalTheFilm) December 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.