Salaar Movie: ‘సలార్’ రెండో ట్రైలర్ పై క్రేజీ అప్డేట్.. వేరెలెవల్లో దేవా వెర్షన్.. రిలీజ్ ఆరోజే..

ఇటీవల ట్రైలర్‏తో ఈసినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశాడు నీల్. ఇప్పటివరకు ప్రభాస్ ఫ్యా్న్స్ ఊహించని మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇటు రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో రోజు రోజుకీ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది.

Salaar Movie: 'సలార్' రెండో ట్రైలర్ పై క్రేజీ అప్డేట్.. వేరెలెవల్లో దేవా వెర్షన్.. రిలీజ్ ఆరోజే..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2023 | 9:42 PM

మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’. ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా మెప్పించకపోవడంతో ఇప్పుడు అభిమానుల ఆశలన్ని ఈ సినిమాపైనే ఉన్నాయి. అంతేకాకుండా కొన్నేళ్ల తర్వాత ప్రభాస్.. ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. అలాగే కేజీఎఫ్ 1,2 సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈసినిమాను చూసేందుకు అడియన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచగా.. ఇటీవల ట్రైలర్‏తో ఈసినిమా ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పేశాడు నీల్. ఇప్పటివరకు ప్రభాస్ ఫ్యా్న్స్ ఊహించని మాస్ యాక్షన్ కంటెంట్ ఈ సినిమాలో ఉండనుందని తెలుస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ సినిమాగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇటు రిలీజ్ టైం దగ్గరపడుతుండడంతో రోజు రోజుకీ ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు సలార్ సెకండ్ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి ట్రైలర్ లో దేవా వెర్షన్ లో ప్రభాస్ విట్నెస్ చేస్తే.. ఇక ఇప్పుడు రెండో ట్రైలర్ లో సలార్ గా ప్రభాస్ కనిపించే వెర్షన్ చూపించనున్నారని తెలుస్తోంది. దేవా నుంచి సలార్ గా ప్రభాస్ ఎలా మారాడు అన్నది సెకండ్ ట్రైలర్ లో ఉండనుందని బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ సెకండ్ ట్రైలర్ ఏ లెవల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్న అప్డేట్ ప్రకారం డిసెంబర్ 16న ఈ సినిమా రెండో ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

కేజీఎఫ్ 1, 2 తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ ఆద్య పాత్రలో కనిపించనుంది. అలాగే మలయాళి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటించనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్లు గతంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.