AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: రష్మిక డిష్యుం.. డిష్యుం.. ‘ది గర్ల్‌ ఫ్రెండ్’ సినిమా కోసం నేషనల్‌ క్రష్‌ సాహసం

స్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా వెలిగిపోతున్న నటి రష్మిక మందన్నకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. యానిమల్‌ విజయోత్సాహంలో ఉన్న రష్మిక ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది. అదే ది గర్ల్‌ ఫ్రెండ్‌.

Rashmika Mandanna: రష్మిక డిష్యుం.. డిష్యుం.. 'ది గర్ల్‌ ఫ్రెండ్' సినిమా కోసం నేషనల్‌ క్రష్‌ సాహసం
Rashmika Mandanna
Basha Shek
|

Updated on: Dec 07, 2023 | 7:45 AM

Share

యానిమల్‌ సినిమాతో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా క్రేజ్‌ మరో లెవెల్‌కు వెళ్లిపోయింది. ఇందులో ఆమె అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా వెలిగిపోతున్న నటి రష్మిక మందన్నకు భారీగా ఆఫర్లు వస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. యానిమల్‌ విజయోత్సాహంలో ఉన్న రష్మిక ఇప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది. అదే ది గర్ల్‌ ఫ్రెండ్‌. ఒక భిన్నమైన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం రష్మిక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోందట. ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చెప్పగానే ఇది ఒక ప్రేమకథా చిత్రమని ప్రేక్షకులు అనుకోవడం సహజం. అయితే దీనికి భిన్నంగా ఈ సినిమా ఉండనుందట. చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు గ్రహీత రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇందులో ప్రధాన కథానాయికగా నటిస్తున్న రష్మిక మందన్న ఫైటింగ్, యాక్షన్‌ సీక్వెన్స్‌లో కూడా నటిస్తోందట. ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లో ‘యానిమల్’ సినిమాను ప్రమోట్ చేసిన రష్మిక మందన్న నేరుగా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా షూటింగ్ సెట్‌కి వచ్చింది. తొలి దశ షూటింగ్‌లో పాల్గొంది. మొదటి 20 రోజుల షూటింగ్‌లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో రష్మిక కూడా జాయిన్‌ అయ్యింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాకుండా అద్భుతమైన యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి. రష్మిక మందన్న రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించనుంది.ఈ మూవీ కోసం గత కొన్ని నెలలుగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటోందట నేషనల్‌ క్రష్‌. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ ఇదిగో..

మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ..

యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..