Bigg Boss 7 Telugu: మస్త్ షేడ్స్.. రచ్చ చేసిన శోభా .. అమర్ మీద అలక, ప్రియాంకతో గొడవ, ప్రశాంత్ తో వాదన

ముందుగా బిగ్ బాస్ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో శోభా ఓ రేంజ్ లో యాక్టింగ్ చేసింది. అందరు సింపథీ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్నారంటూ గోల చేసింది. చివరకు తన ఫ్రెండ్ అయిన ప్రియాంకతో గొడవ పెట్టుకుంది. నెక్స్ట్ వీక్ బయటికి వెళ్లాల్సి వస్తే పోతా.. టైమ్ వస్తే వెళ్లాలి ఏం చేస్తా.. అంటూ డైలాగ్స్ కొట్టింది.

Bigg Boss 7 Telugu: మస్త్ షేడ్స్.. రచ్చ చేసిన శోభా .. అమర్ మీద అలక, ప్రియాంకతో గొడవ, ప్రశాంత్ తో వాదన
Bigg Boss 7 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 07, 2023 | 7:26 AM

గత ఎపిసోడ్ లో ఫన్నీ గేమ్స్ ఆడించిన బిగ్ బాస్ ఇప్పుడు సీరియస్ మోడ్ లోకి వచ్చాడు. నిన్న హౌస్ మేట్స్ కు ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ మధ్య గట్టివాదనే జరిగింది. ముందుగా బిగ్ బాస్ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో శోభా ఓ రేంజ్ లో యాక్టింగ్ చేసింది. అందరు సింపథీ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్నారంటూ గోల చేసింది. చివరకు తన ఫ్రెండ్ అయిన ప్రియాంకతో గొడవ పెట్టుకుంది. నెక్స్ట్ వీక్ బయటికి వెళ్లాల్సి వస్తే పోతా.. టైమ్ వస్తే వెళ్లాలి ఏం చేస్తా.. అంటూ డైలాగ్స్ కొట్టింది. ఇంతలో ప్రియాంకా ఎదో చెప్పాలని ప్రయత్నిస్తే దానికి శోభా అడ్డుపడి..ఎక్కడి వరకూ రాసిపెట్టి ఉంటే అక్కడి వరకూ వెళ్తా. నువ్ చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదు అంటూ వాదించింది.

నాకు నీ సింపథీ ఏం వద్దు.. మీరందరూ నాకు సింపథీతో సపోర్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు.. అది నాకు వద్దు..అంటూ శోభా కొంచం ఓవర్ యాక్షన్ చేసింది. ఆతర్వాత అర్జున్ కు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అమర్ మాదిరిగానే కేక్ తినాలి అని చెప్పాడు. అయితే అర్జున్ కు ఏకంగా 2 కేజీల కేక్ ఇచ్చాడు. సగం తిన్న అర్జున్ నావల్ల కాదు అని చేతులెత్తేశాడు. ఆతర్వాత యావర్ తో కలిసి ఆ కేక్ ను పూర్తి చేశాడు. అదే సమయంలో శోభను కెమెరాకు అడ్డు వస్తున్నావ్ పక్కకు రా అన్నందుకు అమర్ పై అలిగింది. నేనే అడ్డొస్తున్నాన్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిచన్ లో ప్రశాంత్ ను గెలికింది శోభ.

ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారికి ఓ టాస్క్ ఇచ్చాడు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒకరి పేరు బేబీ, మరొకరు బీబీ.. నేను షాపింగ్‌కి వెళ్తున్నాను.. వచ్చే వరకూ నా పిల్లలకి ఏం కావాలో అవి చేసి పెట్టండి.. వాళ్లను సంతోషంగా ఉంచండిం అని చెప్పాడు. ఈ క్రమంలోనే రెండు బొమ్మలను హౌస్ లోకి పంపించాడు. ఆ బొమ్మలను పట్టుకొని వాటిని లాలించి ఆడించి సందడి చేశారు హౌస్ మేట్స్. ఆతర్వాత ఓట్ అప్పీల్‌కి ఛాన్స్ గెలుచుకునేందుకు ఒక గేమ్.. ఇసుకతో కేక్ చేసి దాని పై ఓ చెర్రీ ఉంచి ఓ కార్డుతో ఆ కేకును కట్ చేసి ఆ చెర్రీని కింద పడకుండా ఉంచాలి అలా పడితే వాళ్లు గేమ్ నుంచి అవుట్ అవుతారు అని చెప్పాడు. ఈ టాస్క్ లో అమర్ విన్ అయ్యాడు. ఓట్ అప్పీల్ కోసం మొదటి కంటెండర్‌గా అమర్ నిలిచాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.