Bigg Boss 7 Telugu: ఓటింగ్‌లో అమర్ దీప్, ప్రశాంత్ హోరాహోరీ.. ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ ఫిక్స్..
ఇప్పుడు అలా కాకుండా గ్రాండ్ ఫినాలే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని.. ఈ శని, ఆదివారాలు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయొచ్చని చెప్పారు హోస్ట్ నాగార్జున. ఇక ఈ వారం ఫినాలే టికెట్ గెలుచుకోవడంతో అర్జున్ నేరుగా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక అర్జున్ మినహా.. ఈవారం అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్, శోభా, ప్రియాంక నామినేట్ అయ్యారు. అయితే వీరితోపాటు.. అర్జున్‌కు కూడా ఓటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు 14వ వారం వీకెండ్ వచ్చేసింది.

బిగ్‌బాస్ సీజన్ 7 తుది దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక గత సీజన్స్ మాదిరిగా కాకుండా ఈ సీజన్లో అంతా ఉల్టా పుల్టాగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలిమినేషన్ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ అందుబాటులో ఉంచారు. నిజానికి శుక్రవారం వరకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా గ్రాండ్ ఫినాలే వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని.. ఈ శని, ఆదివారాలు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయొచ్చని చెప్పారు హోస్ట్ నాగార్జున. ఇక ఈ వారం ఫినాలే టికెట్ గెలుచుకోవడంతో అర్జున్ నేరుగా ఫైనల్ కంటెస్టెంట్ అయ్యాడు. ఇక అర్జున్ మినహా.. ఈవారం అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్, శోభా, ప్రియాంక నామినేట్ అయ్యారు. అయితే వీరితోపాటు.. అర్జున్‌కు కూడా ఓటింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు 14వ వారం వీకెండ్ వచ్చేసింది. అయితే గత వారం రోజుల నుంచి హౌస్ లో టాస్కులు జరుగుతుండడంతో ఓటింగ్ శాతం కూడా మారుతునే ఉంది.
ఇక ఎప్పటిలాగే అమర్ వర్సెస్ ప్రశాంత్ మధ్య హోరా హోరీ పోటీ నడుస్తుంది. అయితే గత రెండు రోజులలో అమర్ దీప్ ప్రవర్తన కారణంగా కాస్త ఓటింగ్ తగ్గినట్లుగా తెలుస్తోంది. దాదాపు 41.39 శాతం అత్యధిక ఓట్లతో రైతు బిడ్డ ప్రశాంత్ టాప్ స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక రెండో స్థానంలో అంటే.. 31 శాతంతో అమర్ దీప్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో శివాజీ 27 శాతం ఓటింగ్ తో మూడవ స్థానంలో.. ఆ తర్వాతి స్థానంలో యావర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక, శోభాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చినట్లు సమాచారం.
అయితే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం.. ఈ వారం బిగ్ బాస్ దత్తపుత్రిక శోభా శెట్టి ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు హౌస్ మెంబర్స్ అందరిలో శోభాకు అతి తక్కువ ఓటింగ్ వచ్చింది. నిజానికి గత కొన్నివారాలుగా అందరి కంటే తక్కువ ఓటింగ్ ఆమెకే వస్తుంది. కానీ అనుహ్యంగా శోభా ఎలిమినేట్ కాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ ఓటింగ్ పై అడియన్స్ కు చిరాకు వచ్చేసింది. సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ ఎలిమినేషన్ తీరుపై ఫైర్ అయ్యారు. అంతేకాదు.. ఈవారం కంటెస్టెంట్స్ అందరిలో అసలు 1 శాతం కూడా ఓటింగ్ శోభాకు రాలేదంటే ఆమెపై ఏ స్థాయిలో నెగిటివిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈసారి శోభాను సేవ్ చేయడం కష్టమే. అందుకే ఈసారి తప్పక శోభాను ఎలిమినేట్ చేయడం కావడం ఖాయమని తెలుస్తోంది.
అయితే శోభా ఎలిమినేషన్ పై ఇప్పటివరకు సరైనా క్లారిటీ రాలేదు. నిజానికి ఇప్పటివరకు శోభాకు తక్కువ ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఆమెతోపాటు.. ప్రియాంక, యావర్ సైతం డేంజర్ జోన్ లో ఉన్నారు. దీంతో శోభాను సేవ్ చేసేందుకు ప్రియాంక, యావర్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ శోభా సేవ్ అయితే.. ఇక ఫైనల్ గా యావర్ ను ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.




