Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ఈ సినిమాకు సెన్సార్‌ రిపోర్ట్ ఇచ్చింది. సినిమాను వీక్షించి సెన్సార్‌ సభ్యులు 'పిండం' మూవీకి 'A' సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీనిబట్టే ఈ సినిమాలో ఎలిమెంట్స్‌ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సినిమాకు 'A' సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే...

Tollywood: గర్భిణీలు ఈ సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ విన్నపం
Pindam Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 11, 2023 | 5:15 PM

ఇప్పటి వరకు చూడని అత్యంత భయంకరమైన సినిమా (ది స్కేరియస్ట్‌ ఫిల్మ్‌ ఎవర్‌) అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన సినిమా ‘పిండం’. శ్రీరామ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కిరణ్‌ దైదా దర్శకత్వం వహించారు. ట్రైలర్‌తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్‌. డిసెంబర్‌ 15వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉందీ చిత్రం.

ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ఈ సినిమాకు సెన్సార్‌ రిపోర్ట్ ఇచ్చింది. సినిమాను వీక్షించి సెన్సార్‌ సభ్యులు ‘పిండం’ మూవీకి ‘A’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. దీనిబట్టే ఈ సినిమాలో ఎలిమెంట్స్‌ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సినిమాకు ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమాను గర్భిణీలు చూడకండి అంటూ చిత్ర యూనిట్‌ ఒక హెచ్చరికను జారీ చేయడం గమనార్హం.

పిండం చిత్ర యూనిట్ చేసిన ట్వీట్..

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. చిత్ర యూనిట్ ఇంతలా భయపెడుతోన్న ఈ సినిమాలో అసలు ఏముందన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. దీంతో హార్రర్‌ మూవీస్‌ను ఇష్టపడే వారిని ‘పిండం’ కచ్చితంగా ఎగ్జైట్‌కి గురి చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 15వ తేదీన విడుదల చేయనున్నారు.

పిండం మూవీ ట్రైలర్..

ఇక పిండం కథ విషయానికొస్తే.. ఓ మారుమూల గ్రామంలోని ఓ ఇంట్లోకి శ్రీరామ్‌ తన కుంటుంబంతో వస్తాడు. ఇంట్లో అడుగుపెట్టిన అనంతరం అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఉన్న‌ ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి మంత్రగత్తె ఈశ్వరీ రావు వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఏం జరుగుతుంది.? అన్న ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..