Japan OTT: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసిన కార్తీ ‘జపాన్’.. ఎక్కడ చూడొచ్చంటే? ఒక ట్విస్ట్ ఉందండోయ్
సర్దార్, పొన్నియన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ నటించిన చిత్రం జపాన్. కార్తీ సినిమా కెరీర్‌లో ఇది 25వ సినిమా. రాజు మురుగన్ తెరకెక్కించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్‌తోనే కార్తీ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్లలో విడుదలైన జపాన్..

కోలీవుడ్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే కోలీవుడ్‌తో పాటు తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే కార్తీ నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలై సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో సర్దార్, పొన్నియన్ సెల్వన్ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ నటించిన చిత్రం జపాన్. కార్తీ సినిమా కెరీర్‌లో ఇది 25వ సినిమా. రాజు మురుగన్ తెరకెక్కించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్‌తోనే కార్తీ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే దీపావళి కానుకగా నవంబర్ 10న థియేటర్లలో విడుదలైన జపాన్ అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే ఎప్పటిలాగే కార్తీ తన నటనతో ఆడియెన్స్‌ను మెప్పించాడు. ముఖ్యంగా తన గత సినిమాల్చతో పోల్చితే జపాన్ మూవీలో డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్‌తో కడుపుబ్బా నవ్వించాడు కార్తీ. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన జపాన్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ కార్తీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆదివారం (డిసెంబర్ 11) అర్ధరాత్రి నుంచి జపాన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఓ ట్వి్స్ట్ ఉంది. కార్తీ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ వస్తుందని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్స్ త్వరలోనే రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.
జపాన్ సినిమాలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్‌తో పాటు సునీల్, విజయ్ మిల్టన్, జీతన్ రమేశ్, కే ఎస్ రవికుమార్, చంద్ర శేఖర్, మహ్మద్ ఇర్ఫాన్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాశ్ బాబు, ప్రభు నిర్మించిన జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ఇందులో కార్తీ దొంగ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం నలన్ కుమారసామీ దర్శకత్వంలో వా వాతియారే అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
త్వరలోనే తెలుగులో కూడా..
Japan jewels-ah mattum illa unga manasayum thiruda vanthutaan😍 #Japan is now streaming on Netflix in Tamil. Coming soon in Telugu, Kannada, Malayalam, Hindi. #JapanOnNetflix pic.twitter.com/rozby7BGBC
— Netflix India South (@Netflix_INSouth) December 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








