Brahmamudi, December 13th episode: తండ్రితో కలిసి అనామిక కన్నింగ్ ప్లాన్.. శ్వేతతో రాజ్ ప్రేమాయణం!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని అనామిక అమ్మ శైలు తిడుతూ ఉంటే.. కళ్యాణ్ ఆవేశంగా అనామికపై అరుస్తాడు. మా వదినను మీ అమ్మ అన్ని మాటలు అంటే.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత అప్పూ కూడా ఏంటి అనామిక ఏమీ మాట్లాడవు.. మీ పెళ్లి మొదటి నుంచీ సపోర్ట్ చేసింది మా అక్కనే కదా.. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి వరకూ తీసుకొచ్చింది కావ్య అక్కనే కదా.. మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే.. ఏమీ మాట్లాడవేంటి? అని అంటుంది. మాట సహాయం చేసింది కదా అని.. గొంతు కోసుకోమంటావా..

Brahmamudi, December 13th episode: తండ్రితో కలిసి అనామిక కన్నింగ్ ప్లాన్.. శ్వేతతో రాజ్ ప్రేమాయణం!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 13, 2023 | 10:12 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్యని అనామిక అమ్మ శైలు తిడుతూ ఉంటే.. కళ్యాణ్ ఆవేశంగా అనామికపై అరుస్తాడు. మా వదినను మీ అమ్మ అన్ని మాటలు అంటే.. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. ఆ తర్వాత అప్పూ కూడా ఏంటి అనామిక ఏమీ మాట్లాడవు.. మీ పెళ్లి మొదటి నుంచీ సపోర్ట్ చేసింది మా అక్కనే కదా.. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి వరకూ తీసుకొచ్చింది కావ్య అక్కనే కదా.. మీ అమ్మ అన్ని మాటలు అంటుంటే.. ఏమీ మాట్లాడవేంటి? అని అంటుంది. మాట సహాయం చేసింది కదా అని.. గొంతు కోసుకోమంటావా.. అయినా నువ్వు చిన్న పిల్లవి.. ఇలాంటివి నీకు అర్థం కాదు.. ఊరుకో అని అప్పూపై అరుస్తుంది. అంత ఎందుకు ఇంత జరిగిన తర్వాత కూడా.. ధాన్య లక్ష్మి మా అమ్మాయిని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తుందా.. అని అడుగుతుంది శైలు.

కావ్యకు సపోర్ట్ గా నిలిచిన రాజ్..

అప్పుడు రాజ్ రియాక్ట్ అవుతూ.. మా పిన్ని ఈ పెళ్లి చేయాలా.. వద్దా అని ఆలోచించడం లేదండి.. కళావతిపై మీరు వేస్తున్న నిందల గురించి బాధ పడుతుంది. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ కళావతిని అంతగా నమ్ముతారు కాబట్టి.. ఎవరి విషయంలో ఎలా ఉన్నా తన మరిది విషయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తుంది. అలాంటి మనిషి ఇలా చేస్తుందని ఎలా అనుకుంటారు? అని రాజ్ నిలదీస్తాడు. ఈలోపు రుద్రాణి మధ్యలో దూరుతుంది. ఇంత అపచారం జరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటే అని అనబోతుంటే.. ఇలాంటి కారణాలు చూపించి.. పెళ్లి ఆపేసేయంత సంస్కారం మాకు లేదని అంటాడు. ఏది ఏమైనా అనామికతో కళ్యాణ్ పెళ్లి జరుగుతుందని మాట ఇస్తాడు రాజ్.

కావ్యకు తెలీకుండా శ్వేతతో రాజ్ ప్రేమాయణం..

ఆ తర్వాత రాజ్ కి శ్వేత దగ్గరి కాల్ వస్తుంది. దీంతో హడావిడిగా శ్వేతని కలవడానికి వెళ్తాడు. ఆ నెక్ట్స్.. కనకం, కావ్య కిచెన్ లో ఉండి పని చేస్తారు. ఈలోపు నీ వల్ల పెళ్లి ఆగిపోతే చెడ్డ పేరు వచ్చేదని కనకం అంటుంది. కానీ మా ఆయన ఊరుకునే రకం కాదని అర్థమైపోయింది కదా అని కావ్య అంటుంది. అదే కదా నా బాధ ఊరుకుని ఉంటే.. గొడవ పెద్దది అయ్యేది.. పెళ్లి ఆగిపోయేది అని కనకం మనసులో అనుకుంటుంది. నా అల్లుడు శ్రీరామ చంద్రుడు.. చాలా మారిపోయారు. ఇలా డబ్బు ఉన్నవాళ్లకు జీవితంలో ఎవరో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది. కానీ ఆ విషయంలో నువ్వు అదృష్ట వంతురాలివి అని అంటుంది కనకం. మరోవైపు రాజ్.. శ్వేతతో క్లోజ్ గా మూవ్ అవుతూ నడుస్తూ ఉంటాడు. మొత్తానికి ఏం సస్పెన్స్ ఉండబోతుందో వెయిట్ చేయాలి.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ కి భరోసాగా నిలిచిన కావ్య..

హాలులో కళ్యాణ్ దిగాలుగా కూర్చుని ఉంటాడు. ఈ లోపు కావ్య వచ్చి జ్యూస్ ఇస్తుంది. భయం వేస్తుంది వదినా.. ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటేనే భయంగా ఉంది. తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. పంతులు గారు చెప్పినట్టు.. కార్డు కాలిపోయిందనుకుంటున్నారా.. అని కళ్యాణ్ అంటే.. కవి గారూ ఈ మాయలు, అద్భుతాలు మన లాంటి ఇళ్లల్లో జరగవు.. ఇవన్నీ మూఢ నమ్మకాలు అని సర్ది చెప్తుంది కావ్య. అప్పుడే అపర్ణ, ఇందిరా దేవి, ధాన్య లక్ష్మి వస్తారు. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు. ఇక కావ్య ఏదో ఒకటి చెప్పి మాట మారుస్తారు. సరిగ్గా ఈ టైమ్ లోనే రాజ్ కూడా వస్తాడు. పెళ్లి ఎంతో గ్రాండ్ గా చేద్దాం అంటాడు.

పెళ్లి కార్డు కాలినందుకు టెన్షన్ పడుతున్న అనామిక:

ఈ సీన్ కట్ చేస్తే.. పెళ్లి పత్రిక కాలిపోవడం గురించి అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడొద్దు అని తండ్రి సుభ్రమణ్యం అంటే.. కానీ ఇలాంటి మళ్లీ జరిగితే అని శైలు అంటాడు. అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఏంటి ఇంకా ఆ మూడ్ లోనే ఉన్నావా.. అని అడుగుతాడు. మొదటి పెళ్లి పత్రిక కాలిపోవడం అనేది మామూలు విషయం కాదు. మా మామ్ అండ్ డాడ్ కూడా టెన్షన్ పడుతున్నారని అనామిక అంటే.. కానీ మా ఇంట్లో మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని అంటాడు. ఇలాంటివి జరగకుండా ఉండటానికి కార్తిక పౌర్ణమి కాబట్టి ఉపవాసం ఉందాం అనుకుంటున్నారు అని చెప్తాడు. దీంతో థాంక్స్ చెప్తుంది అనామిక.

పెళ్లి కోసం అనామిక పేరెంట్స్ కన్నింగ్ ప్లాన్స్:

వాళ్లు ఏమీ పెళ్లి పత్రిక కాలిపోవడం గురించి పట్టించు కోవడం లేదని చెప్తుంది అనామిక. ఈలోపు సుబ్రమణ్యం ఫిటింగ్ లు పెడతారు. వాళ్లను నమ్మించాలని చెప్తాడు. కానీ నాకు కావ్య మీద అనుమానంగా ఉందని శైలు అంటుంది. ముందు అమ్మాయి పెళ్లి అయిపోని ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని ప్లాన్ వేస్తాడు సుబ్రమణ్యం.

కళ్యాణ్ తో అప్పూ పెళ్లి జరిపించాలని కనకం ప్రయత్నాలు..

మరోవైపు కళ్యాణ్ ఎంగేజ్ మెంట్ గురించి ఆలోచిస్తూ.. బాధ పడుతూ ఉంటుంది అప్పూ. ఈలోపు కనకం.. అప్పూకి ఫోన్ చేసి ఉపవాసం ఉండమని చెప్తుంది. కానీ అప్పూ మాత్రం కుదరదని అంటుంది. ఇక కనకం.. అప్పూని సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసి అప్పూని ఒప్పిస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్, అనామిక పెళ్లి క్యాన్సిల్ అవ్వాలని కనకం కోరుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.