Bigg Boss 7 Telugu: యావర్తో పోటీ అంటే ఆలోచించాల్సిందే.. బిగ్బాస్ జర్నీ వీడియో చూసి ఏడ్చేసిన ప్రిన్స్..
శివాజీ, ప్రియాంక జర్నీ వీడియోస్ చూపించారు. ఇక శివాజీ ఆడిన తీరు.. మాట్లాడిన విధానం.. ఇంటిసభ్యులతో వ్యవహరించిన తీరుపై బిగ్బాస్ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ప్రియాంక తన వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈరోజు యావర్, పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోస్ చూపించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. మొదటి నుంచి కోపం ఎక్కువ అనే ట్యాగ్ సంపాదించుకున్న యావర్.. తన జర్నీ వీడియో చూసి చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు.
ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో ఈవారం మరింత ఎమోషనల్గా సాగుతుంది. టాప్ 6 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోస్ చూపిస్తూ.. వారి ఆట తీరును.. స్వభావాలను తెలుపుతున్నాడు బిగ్బాస్. ఇప్పటికే అమర్ దీప్, అర్జున్ జర్నీ వీడియోస్ టెలికాస్ట్ అయ్యాయి. ఇద్దరు తమ జర్నీ వీడియోలను చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత శివాజీ, ప్రియాంక జర్నీ వీడియోస్ చూపించారు. ఇక శివాజీ ఆడిన తీరు.. మాట్లాడిన విధానం.. ఇంటిసభ్యులతో వ్యవహరించిన తీరుపై బిగ్బాస్ ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ప్రియాంక తన వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈరోజు యావర్, పల్లవి ప్రశాంత్ జర్నీ వీడియోస్ చూపించబోతున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రిన్స్ యావర్ జర్నీ వీడియోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. మొదటి నుంచి కోపం ఎక్కువ అనే ట్యాగ్ సంపాదించుకున్న యావర్.. తన జర్నీ వీడియో చూసి చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. నిజానికి యావర్ బిగ్బాస్ జర్నీ సైతం ప్రేక్షకులకు మరింత నచ్చేసింది. మొదటి వారం నుంచి ఇప్పటివరకు యావర్ ఆట తీరును.. తన మనస్తత్వాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు బిగ్బాస్.
“యావర్.. మీరు ఒక విషయాన్ని ఇష్టపడితే దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధపడే మీ గుణం అందరికీ నచ్చింది. టాస్కులలో మీకు ఎవరూ పోటీ కారు అనే విధంగా ప్రతి టాస్కులో మీ ఆధిపత్యం చూపించారు. యావర్ తో పోటీ అంటే అందరూ ఆలోచించేలా చేశారు. మీకు దొరికిన అమూల్యమైన స్నేహం కూడా మీ ప్రయాణం సాఫీగా ముందుకు కదిలేందుకు దోహదపడింది. మీ కోపం.. మీ పట్టుదల.. మీకు తప్పు కనిపించిన ప్రతి చోటా కనిపించాయి. అదే ధైర్యం మీరు ఎవిక్షన్ పాస్ సాధించేలా చేసింది. ఆ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసినప్పుడు నీతిగా గెలవాలనే మీ క్యారెక్టర్ అందరికీ నచ్చింది” అంటూ బిగ్బాస్ చెప్పడంతో భోరున ఏడ్చేశాడు యావర్. ఆ తర్వాత తన జర్నీ వీడియో చూసి వెక్కి వెక్కి ఏడ్చేశాడు యావర్.
View this post on Instagram
ప్రస్తుతం ఓటింగ్ పరంగా యావర్ మూడవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేని కంటెస్టెంట్.. అందులోనూ తెలుగు సరిగ్గా అర్థం కాకపోవడం..రాకపోవడం.. అయినా.. తన ఆట తీరుతో.. మనస్తత్వం.. వ్యక్తిత్వంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు యావర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.