AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కెప్టెన్సీపై కేకేఆర్‌ కీలక నిర్ణయం.. నితీశ్‌ రాణా స్థానంలో ఆ ఆటగాడికే సారథ్య బాధ్యతలు

ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు మొత్తం 12 మంది ఆటగాళ్లను కేకేఆర్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అలాగే 15 మంది ప్లేయర్లను అంటి పెట్టుకుంది. అంటే ఈ మినీ వేలం ద్వారా మొత్తం 10 మంది ఆటగాళ్లను కేకేఆర్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కేకేఆర్ టీమ్‌లో కొత్త ముఖాలు కనిపిస్తాయని చెప్పొచ్చు.ఈ సంగతి పక్కన పెడితే కెప్టెన్సీపై కేకేఆర్‌ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

IPL 2024: కెప్టెన్సీపై కేకేఆర్‌ కీలక నిర్ణయం.. నితీశ్‌ రాణా స్థానంలో ఆ ఆటగాడికే సారథ్య బాధ్యతలు
Kolkata Knight Riders
Basha Shek
|

Updated on: Dec 14, 2023 | 8:04 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 కోసం రంగం సిద్ధమవుతోంది. ఈనెల 19న దుబాయ్‌ వేదికగా ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. మరోవైపు అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. అలాగే పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లను ఇప్పటికే వదిలించుకున్నారు. అలా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు మొత్తం 12 మంది ఆటగాళ్లను కేకేఆర్ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అలాగే 15 మంది ప్లేయర్లను అంటి పెట్టుకుంది. అంటే ఈ మినీ వేలం ద్వారా మొత్తం 10 మంది ఆటగాళ్లను కేకేఆర్‌ కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి కేకేఆర్ టీమ్‌లో కొత్త ముఖాలు కనిపిస్తాయని చెప్పొచ్చు.ఈ సంగతి పక్కన పెడితే కెప్టెన్సీపై కేకేఆర్‌ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి వరల్డ్‌ కప్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌కే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అంటే రాబోయే సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను శ్రేయస్‌నే ముందుండి నడిపించనున్నాడన్నమాట. గత సీజన్‌లో కేకేఆర్ సారథిగా వ్యవహరించిన నితీష్ రాణా ఈసారి వైస్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. అయితే కేకేఆర్ జట్టు మాత్రుం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే కెప్టెన్ అయ్యర్ మాత్రం 401 పరుగులు చేసి టోర్నీలో లీడ్‌ స్కోరర్లలో ఒకరిగా నిలిచాడు. అయితే 2023లో గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. తద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్‌గా నితీష్ రాణా ఎంపికయ్యాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు:

శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సంగీత్ రాయ్, రింకు సింగ్, వైభవ్ అరోరా, సుయాష్ సింగ్, మన్‌దీప్, కుల్యాజ్ శర్మ, రోసన్ శర్మ, .

ఇవి కూడా చదవండి

కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు:

షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీజా, శార్దూల్ ఠాకూర్, నారాయణ్ జగదీసన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, జాన్సన్ చార్లెస్.

వైస్ కెప్టెన్ గా నితీశ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..