Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2024: అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ భారత జట్టులో తెలంగాణ పోరగాళ్లు.. యంగ్ క్రికెటర్లకు కేటీఆర్‌ విషెస్‌

ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ కోసం బుధవారం (డిసెంబర్‌ 14) బీసీసీఐ భారత క్రికెట్‌ జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ ఉదయ్ సహారన్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేజర్‌ టోర్నీ కోసం టీమిండియాకు ఎంపికైన జట్టులో ఇద్దరు తెలంగాణ యువ క్రికెటర్లు ఉండడం విశేషం

World Cup 2024: అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ భారత జట్టులో తెలంగాణ పోరగాళ్లు.. యంగ్ క్రికెటర్లకు కేటీఆర్‌ విషెస్‌
KTR, Telangana Cricketers
Basha Shek
|

Updated on: Dec 14, 2023 | 5:44 PM

Share

World Cup 2024: అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ భారత జట్టులో తెలంగాణ పోరగాళ్లు.. యంగ్ క్రికెటర్లకు కేటీఆర్‌ శుభాకాంక్షలు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా ప్రతిష్ఠాత్మక అండర్‌ 19 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం బుధవారం (డిసెంబర్‌ 14) బీసీసీఐ భారత క్రికెట్‌ జట్టును ప్రకటించింది. పంజాబ్ బ్యాటర్ ఉదయ్ సహారన్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేజర్‌ టోర్నీ కోసం టీమిండియాకు ఎంపికైన జట్టులో ఇద్దరు తెలంగాణ యువ క్రికెటర్లు ఉండడం విశేషం. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్‌లో పుట్టి పెరిగిన ఆరవెల్లి అవనీష్ రావు, అలాగే హైదరాబాద్‌ మురుగన్‌ అభిషేక్‌ టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ యంగ్ క్రికెటర్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా యువ ఆటగాళ్లకు అభినందనలు, భవిష్యత్‌లో వీరిద్దరూ అత్యున్నత స్థానాలను అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. ‘దక్షిణాఫ్రికాలో జరిగే అండర్‌-19 క్రికెట్ ప్రపంచ కప్, అలాగే ముక్కోణపు సిరీస్‌లకు ఎంపికైనందుకు ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్‌ కీపర్‌/ బ్యాటర్)కు హృదయపూర్వక అభినందనలు. ఈ యువ క్రికెటర్‌ మన రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోతగల్‌ పోరగాడు’ అని అని తనదైన స్టైల్‌లో విష్‌ చేశారు కేటీఆర్‌.

అలాగే మరో క్రికెటర్ మురుగన్‌ అభిషేక్‌ ఫొటోలు ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కేటీఆర్‌’ హైదరాబాద్‌ నుంచి అండర్‌-19 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన మరో తెలివైన కుర్రాడు మురుగన్ అభిషేక్‌ను కూడా అభినందిస్తున్నా. ఈ యువ క్రికెటర్లిద్దరూ మెగా టోర్నీలో బాగా రాణించాలని మనసారా కోరుకుంటున్నా’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మన పోత్ గల్ కుర్రాడే..

అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:

ఉదయ్ సహారన్ (కెప్టెన్ ), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, అరవెల్లి అవనీష్ రావు (వికెట్ కీపర్), సౌమ్య్ కుమార్ పాండే (వైస్ కెప్టెన్), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

ట్రై సిరీస్ రిజర్వ్ ప్లేయర్లు:

ప్రేమ్ దేవ్‌కర్ అన్ష్ గోసాయి, మహ్మద్ అమన్.

బ్యాకప్ ప్లేయర్లు:

దిగ్విజయ్ పాటిల్, జయంత్ గోయత్, పి విఘ్నేష్, కిరణ్ చోర్మలే.

హైదరాబాదీ ప్లేయర్ కూడా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.300లతో ఇంటి నుంచి పారిపోయి.. 30 నిమిషాలకు రూ.100 కోట్లు..
రూ.300లతో ఇంటి నుంచి పారిపోయి.. 30 నిమిషాలకు రూ.100 కోట్లు..
కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే
కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. పైకి లాగి చూడగా ఆశ్చర్యం
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. ఆ రోజు వస్తే అంతా ఉపవాసమే!
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
మార్కెట్లో రూ. 50 నాణెం.. కీలక ప్రకటన చేసిన కేంద్రం
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
డిన్నర్‌కు వస్తున్నానని తల్లికి ఫోన్.. ఆ తర్వాత ఏమైందంటే..?
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
అయిదు గ్రహాల అనుకూలత.. మరో రెండు నెలలు బెస్ట్ రాశులివే!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
ఇకపై స్కూల్స్, కాలేజెస్‌ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
రాత్రితల దగ్గర ఈవస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా గుడ్ బై చెప్పండి
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత
అదొక టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌లా ఫీలయ్యా.. సమంత