Mohammed Shami: ‘నేనొక భారతీయ ముస్లిం.. ఇండియాలో ఎక్కడైనా నమాజ్‌ చేస్తా’.. పాక్‌ నెటిజన్లకు ఇచ్చిపడేసిన షమీ

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు తీశాడు. తన ఐదు వికెట్ల హాల్‌ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే షమీ సెలబ్రేషన్స్‌ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడంటూ అతడిని ట్రోల్ చేశారు. అలాగే పాకిస్థాన్

Mohammed Shami: 'నేనొక భారతీయ ముస్లిం.. ఇండియాలో ఎక్కడైనా నమాజ్‌ చేస్తా'.. పాక్‌ నెటిజన్లకు ఇచ్చిపడేసిన షమీ
Mohammed Shami
Follow us

|

Updated on: Dec 14, 2023 | 4:51 PM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గత రెండు నెలలుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 లో మొదటి 4 మ్యాచ్‌లకు దూరమైన షమీ అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి జట్టులోకి వచ్చాడు. వికెట్ల పంట పండిస్తూ టీమిండియాను ఫైనల్‌ వరకు నడిపించడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు తీసిన షమీ వరల్డ్‌ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ఈ సీనియర్‌ పేసర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన ప్రదర్శనకు గుర్తింపుగా భారత ప్రభుత్వం కూడా షమీని అర్జున అవార్డుకు నామినేట్‌ చేసే యోచనలో ఉంది. అయితే ఎప్పట్లాగే కొందరు నెటిజన్లు మహ్మద్‌ షమీపై నెగెటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన కొందరు నెటిజన్లు, జర్నలిస్టులు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ నిత్యం టీమిండియా స్పీడ్‌ స్టర్‌ను టార్గెట్‌ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. షమీ కూడా వీటికి తనదైన శైలిలో కౌంటర్‌ ఇస్తున్నాడు. తాజాగా మరోసారి వీటిపై స్పందించాడీ సీనియర్‌ పేసర్‌. వివరాల్లోకి వెళితే.. ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు తీశాడు. తన ఐదు వికెట్ల హాల్‌ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే షమీ సెలబ్రేషన్స్‌ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడంటూ అతడిని ట్రోల్ చేశారు. అలాగే పాకిస్థాన్ జర్నలిస్టులు, అభిమానులు స్పందిస్తూ షమీ గ్రౌండ్‌లో సజ్దా చేయాలనుకున్నాడని, అయితే అతను భారత్‌లో ఉండటం వల్ల చేయలేకపోయాడంటూ వ్యాఖ్యానించారు.

గత నెల రోజులుగా ఈ విషయంపై ఏమీ మాట్లాడని షమీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ‘నేను భారతీయ ముస్లిం అయినందుకు ఎంతో గర్విస్తున్నాను. ఎక్కడైనా ఈ మాట చెప్పేందుకు నేను గర్వపడతాను. నేను నమాజ్‌ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే ధైర్యంగా చేస్తాను. ఇందులో ఉన్న సమస్య లేంటో అర్థం కావడం లేదు. నమాజ్‌ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు 5 వికెట్లు సాధించాను. ఎప్పుడైనా నేను గ్రౌండ్‌లో నమాజ్‌ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ నమాజ్‌ చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి ప్రార్థన చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్‌లో నేను 200 శాతం శ్రమించి వికెట్లు తీశాను. దీంతో కాస్త అలసటకు గురయ్యాను. అందుకే ఐదు వికెట్లు తీశాక మోకాళ్లపై కూర్చున్నాను’ అని షమీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పాక్ నెటిజ్లకు షమీ బాగానే ఇచ్చి పడేశాడంటూ టీమిండియా అభిమానులు, నెటిజన్లు సీనియర్ పేసర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అభిమానులతో షమీ సెల్ఫీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..