AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఎలిమినేట్.. స్టేజ్ పైకి తీసుకువచ్చిన సుమ.. బిడ్డ పేరు చెప్పిన అర్జున్..

గౌతమ్.. శుభ శ్రీ, పూజా మూర్తి.. అశ్విని, తేజ.. శోభా శెట్టి, నయని పావని.. సందీప్, భోలే డాన్స్ చేసి సందడి చేశారు. ఆ తర్వాత ఆరుగురు ఫైనలిస్ట్స్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఒక్కొక్కరిని బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని అడిగారు నాగ్. గౌతమ్, శుభ శ్రీ, భోలే, శోభా శెట్టి మాట్లాడిన అనంతరం.. శివాజీ కొడుకులు మాత్రం తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మొదట అమర్ దీప్ తల్లిని మీ అబ్బాయి గురించి అనంతపురంలో ఏమనుకుంటున్నారు

Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఎలిమినేట్.. స్టేజ్ పైకి తీసుకువచ్చిన సుమ.. బిడ్డ పేరు చెప్పిన అర్జున్..
Arjun Ambati
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2023 | 8:54 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా సాగుతుంది. ఇప్పటికే ఆరుగురు ఫైనలిస్ట్స్ ఇంట్లో ఉండగా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మరికాసేపట్లో విన్నర్ ఎవరనేది తెలియనుంది. కేజీఎఫ్ పాటతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఆ తర్వాత గౌతమ్.. శుభ శ్రీ, పూజా మూర్తి.. అశ్విని, తేజ.. శోభా శెట్టి, నయని పావని.. సందీప్, భోలే డాన్స్ చేసి సందడి చేశారు. ఆ తర్వాత ఆరుగురు ఫైనలిస్ట్స్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఒక్కొక్కరిని బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందని అడిగారు నాగ్. గౌతమ్, శుభ శ్రీ, భోలే, శోభా శెట్టి మాట్లాడిన అనంతరం.. శివాజీ కొడుకులు మాత్రం తండ్రికి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మొదట అమర్ దీప్ తల్లిని మీ అబ్బాయి గురించి అనంతపురంలో ఏమనుకుంటున్నారు అని నాగ్ అడగ్గా.. అమర్ అన్నే గెలుస్తాడనే అంటున్నారు సార్.. ఎక్కడికి వెళ్లి అదే అంటున్నారు. తన కొడుకును ఇలా చూడడం గర్వంగా ఉందని తెలిపింది.

ఇక తర్వాత శివాజీ పెద్ద కొడుకు కెన్నీని మాట్లాడిస్తూ.. నువ్వు యూఎస్ వెళ్లిపోతావ్ అని అన్నారు కదా.. వెళ్లలేదా ? అని అడిగితే.. డిసెంబర్ 9నే వెళ్లాల్సింది. కానీ డిసెంబర్ 5న నాన్న ఇంట్లో బాధపడడం చూశాను. వాడితో టైం స్పెండ్ చేస్తే బాగుండని అన్నారు. అందుకే ఉండిపోయాను. అంటూ చెప్పాడు. ఇక తర్వాత చిన్న కొడుకు రిక్కీతో మాట్లాడారు నాగ్. మీకో సీక్రెట్ చెప్తున్నా.. నాన్నకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నాకే ముందు చెప్పారు. డాడీని నీ వల్ల కాదు.. చేయలేవ్ అంటే నేను చేస్తా అంటారు. మీరు ఆడలేరు అన్నాను. నేను ఆడతాను అంటూ వచ్చేశారు అంటూ అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు.

ఇక ఆ తర్వాత బబూల్ గమ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా యాంకర్ సుమ, తనయుడు రోషన్‏తో కలిసి సందడి చేసింది. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై బబూల్ గమ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతరం యాంకర్ సుమను మొదటి ఎలిమినేషన్ కోసం ఇంట్లోకి పంపించారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మొదటిగా అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. స్టార్ యాంకర్ సుమ అర్జున్ ను హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. అర్జున్ తో పాటు అతని భార్య సురేఖ కూడా బిగ్ బాస్ వేదికపైకి తీసుకువచ్చి ఫోటోకు స్టిల్ ఇచ్చాడు నాగ్. హౌస్ లో ఉన్నా ఎక్కువగా టెన్షన్ ఉండే అని.. ఏ వారం బయటకు వచ్చేస్తానా అని తన భార్య టెన్షన్ పడుతుందేమో అని ఎక్కువగా ఆలోచించేవాడినిని అన్నాడు. అలాగే తమకు పుట్టబోయే బిడ్డకు ఆర్కా అనే పేరు పెట్టాలనుకున్నట్లు చెప్పాడు. అర్జున్ నిజానికి గత రెండు వారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఫినాలే అస్త్ర గెలవడంతో నేరుగా ఫైనలిస్ట్ అయ్యాడు. ఆతర్వాత ఓటింగ్ తక్కువగా వచ్చింది అర్జున్ అంటూ అసలు విషయం నాగార్జున బయటపెట్టడంతో బలం కాదు.. బలగం ముఖ్యమని తెలుసుకున్నాడు అర్జున్.