Kangana Ranaut: రాజకీయాల్లోకి బాలీవుడ్ స్టార్ కంగనా.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తుందంటే..
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాలతో పాటు ఇప్పుడు రాజకీయాల్లో కంగనా అడుగు పెట్టనుందని చ్చలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కంగనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే చర్చ సాగుతోంది. ఎంపీగా ఎన్నికలలో పోటీ చేయబోతోందని టాక్ బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు సొంతం చేసుకుంది ఈ భామ. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాలతో పాటు ఇప్పుడు రాజకీయాల్లో కంగనా అడుగు పెట్టనుందని చ్చలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కంగనా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందనే చర్చ సాగుతోంది. ఎంపీగా ఎన్నికలలో పోటీ చేయబోతోందని టాక్ బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు దీనిపై కంగనా తండ్రి హింట్ ఇచ్చాడు. బీజేపీ పార్టీ నుంచి కంగనా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు సమాచారం. అయితే ఏ ప్రదేశం నుంచి అనేది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.
కంగనా తండ్రి అమర్‌దీప్ రనౌత్ ఇచ్చిన సమాచారం ప్రకారం కంగనా బీజేపీ తరుపున పోటీ చేయనున్నారు. అయితే కంగనా ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో పార్టీ ఇంకా నిర్ణయించలేదు. ఆదివారం, కంగనా కులులోని శాస్త్రినగర్‌లోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో కలిశారు. అప్పటి నుంచి కంగనా బీజేపీ నుంచి పోటీ చేయనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇప్పుడు ఆమె వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె తండ్రి స్పష్టం చేశారు.
కంగనా ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూనే ఉంటుంది. భాజపా పార్టీకి మద్దతుగా కంగనా సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతోంది. అందుకే ఈ ఏడాది ఎన్నికల్లో ఈ అమ్మడు కచ్చితంగా పోటీ చేస్తుందని అభిమానుల్లో చర్చ సాగుతుంది. అంతేకాదు, హిమాచల్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి కూడా కంగనా హాజరయ్యింది. కంగనా చండీఘర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ‘తేజస్’ సినిమా తర్వాత కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ సినిమాతో అభిమానులను ముందుకు రానుంది. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మొదట నవంబర్ 2023లో విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా 2024లో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రంలో కంగనా రనౌత్, శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, దివంగత సతీష్ కౌశిక్ అలాగే నటి మహిమా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
Happy Diwali everyone 🪔✨#HappyDeepavali pic.twitter.com/tKr7ugGmWD
— Kangana Ranaut (@KanganaTeam) November 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.