OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఇకపై సినిమాలు, వెబ్ సిరీసుల్లో వాటికి నో ఛాన్స్

కోవిడ్ ఆవిర్భావం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరిగింది. Amazon Prime, Netflix సహా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ పెరిగింది . అయితే ఇప్పుడు సినిమా ప్రియులకు భారీ షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి ఓటీటీ సంస్థలు. సాధారణంగా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు..

OTT Movies: ఓటీటీ ఆడియెన్స్‌కు బ్యాడ్ న్యూస్‌.. ఇకపై సినిమాలు, వెబ్ సిరీసుల్లో వాటికి నో ఛాన్స్
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2023 | 9:58 PM

కోవిడ్ ఆవిర్భావం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం పెరిగింది. Amazon Prime, Netflix సహా అనేక OTT ప్లాట్‌ఫారమ్‌లకు డిమాండ్ పెరిగింది . అయితే ఇప్పుడు సినిమా ప్రియులకు భారీ షాక్‌ ఇచ్చేలా ఉన్నాయి ఓటీటీ సంస్థలు. సాధారణంగా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. సినిమాలో ఏదైనా అదనపు సన్నివేశం పెడితే సెన్సార్ బోర్డు ముందు ఉంచిన తర్వాతే సిల్వర్‌ స్క్రీన్‌పైకి అనుమతిస్తారు. అయితే, OTT ప్లాట్‌ఫారమ్‌లకు అలాంటి పరిమితి లేదు. అక్కడ ప్రసారమయ్యే సినిమాలకు ఎలాంటి సెన్సార్ ప్రక్రియ అవసరం లేదు. అన్‌ కట్‌, అన్‌ ఎడిటెడ్‌ వెర్షన్స్‌ అంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌ లను స్ట్రీమింగ్‌ కు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పటి నుంచి ఓటీటీ మూవీస్‌, సిరీస్‌ లకు సెన్సార్‌ ఉండనుంది. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లోని అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇకపై డిజిటల్‌ స్ట్రీమింగ్ సినిమాలకు సెన్సార్‌ నిబంధనలు విధించింది. ముఖ్యంగా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సెన్సార్ చేయని వెర్షన్‌ను ప్రసారం చేయవద్దని సెన్సార్ బోర్డు నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. Netflix ఈ సూచనను అనుసరించడం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతల ప్రస్తావన ‘భీద్’ సినిమాలో ఉంది. ఇది ఇటీవలే స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. అయితే ఇప్పుడీ సీన్లను పూర్తిగా కత్తిరించేశారు.

‘లియో’, ‘ఓఎంజీ 2’ సినిమాలో కట్‌ పార్ట్‌లను జోడించి ప్రసారం చేశారు. ఇప్పుడు, కొత్త నోటీసు ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ సెన్సార్ చేసిన వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్‌ చేయడం ప్రారంభించాయి. సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో ఓటీటీ ప్రేక్షకులు విస్తుపోతున్నారు. ‘యానిమల్‌’, ‘సలార్’ సినిమాల పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే యానిమల్ సినిమా మొత్తం 4 గంటలకు పైగా ఉంది. అయితే థియేటర్‌ వెర్షన్‌ కేవలం 3 గంటలు మాత్రమే ఉంది. దీంతో ఓటీటీలోనైనా ఫుల్‌ వెర్షన్‌ను చూడొచ్చన్న అభిమానులకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ షాక్‌ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.