‘Karimnagar’s Most Wanted: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్‌.. ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌. పేరుకు తగ్గట్టుగానే ఈ సిరీస్‌లో చాలామంది కరీంనగర్‌కు చెందిన వారే నటించారు. కరీంనగర్‌లోనే షూట్‌ చేశారు. తెలంగాణ నేపథ్యంలో పక్కా లోకల్‌ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన..

‘Karimnagar’s Most Wanted: ఓటీటీలో తెలుగు వెబ్ సిరీస్‌.. 'కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Karimnagars Most Wanted Web Series
Follow us
Basha Shek

|

Updated on: Dec 27, 2023 | 7:42 PM

ఇటీవల తెలుగులోనూ వెబ్‌ సిరీస్‌లు జోరందుకున్నాయి. సైతాన్‌, అతిథి వధువు, ధూత, వ్యూహం తదితర తెలుగు వెబ్‌ సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు ఇదే కోవలో మరో పక్కా లోకల్‌ వెబ్‌ సిరీస్‌ రానుంది. అదే కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌. పేరుకు తగ్గట్టుగానే ఈ సిరీస్‌లో చాలామంది కరీంనగర్‌కు చెందిన వారే నటించారు. కరీంనగర్‌లోనే షూట్‌ చేశారు. తెలంగాణ నేపథ్యంలో పక్కా లోకల్‌ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ సిరీస్‌లో సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన ‘కరీంనగర్ వాలే’ సాంగ్‌ చార్ట్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌ లో రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంది. ట్రైలర్‌ కు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌ మరో రెండు రోజుల్లో రిలీజ్‌ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. డిసెంబర్‌ 22 నుంచి కరీంగనర్స్‌ మోస్ట్ వాంటెడ్ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా సంస్థ.

ఇవి కూడా చదవండి

సస్పెన్స్, డ్రామా, థ్రిల్లింగ్‌.. ఇలా అన్నీ అంశాలను మేలవించి ఒక పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామాగా కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ సిరీస్‌ ను తీర్చిదిద్దారు. ‘బలగం’ ఫేం ప్రముఖ రచయిత రమేష్ ఎలిగేటి ఈ సిరీస్‌కు కథా, కథనం, సంభాషణలు అందించడం విశేషం. ఎస్.అనంత్ శ్రీకర్ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించారు. ఓ ఐదుగురు యువకులు.. ఐదు కోట్ల బ్యాంక్ స్కాంలో అరెస్ట్ అవడం.. అందరితో గొడవలు పెట్టుకుంటూ రౌడీయిజం చేస్తూ.. కోట్లు సంపాదించడం.. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. ఇలా ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్‌ను రూపొందిచినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.