- Telugu News Photo Gallery Cinema photos Natural Star Nani Another record in Tollywood with Hi nanna and Dasara Movies in 2023 Telugu Heroes Photos
Natural Star Nani: 2023లో టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యం కాని మరో రికార్డ్ అందుకున్న నాని.
నాని మారాల్సిన టైమ్ వచ్చిందా లేదంటే ఆయన సినిమాలు చూస్తున్న ప్రేక్షకులే మారాల్సిన టైమ్ వచ్చిందా..? అదేంటి అలా అంటున్నారు.. హాయిగా ఒకే ఏడాది రెండు విజయాలు అందుకున్నారు కదా.. ఇంకేం సమస్య ఉందబ్బా అనుకుంటున్నారు కదా.? అక్కడే ఉంది అసలు సమస్య. అదేంటో ఈ రోజు ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో డీటైల్డ్‌గా చూద్దాం పదండి.. చాలా రోజుల తర్వాత నాని మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసారు. గతేడాది అంటే సుందరానికి అంతంతమాత్రంగానే ఆడటం.
Updated on: Dec 20, 2023 | 8:44 PM

నాని మారాల్సిన టైమ్ వచ్చిందా లేదంటే ఆయన సినిమాలు చూస్తున్న ప్రేక్షకులే మారాల్సిన టైమ్ వచ్చిందా..? అదేంటి అలా అంటున్నారు.. హాయిగా ఒకే ఏడాది రెండు విజయాలు అందుకున్నారు కదా.. ఇంకేం సమస్య ఉందబ్బా అనుకుంటున్నారు కదా..?

అక్కడే ఉంది అసలు సమస్య. అదేంటో ఈ రోజు ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో డీటైల్డ్‌గా చూద్దాం పదండి.. చాలా రోజుల తర్వాత నాని మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసారు. గతేడాది అంటే సుందరానికి అంతంతమాత్రంగానే ఆడటం..

శ్యామ్ సింగరాయ్‌కు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు ఊహించినంత రాకపోవడంతో నిరాశలో ఉన్న నాని.. దసరా, హాయ్ నాన్న విజయాలు కాస్త ఊరటనిచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఒకే ఏడాది ఊర మాస్, పరమ క్లాస్ రెండూ కవర్ చేసారు న్యాచురల్ స్టార్.

2023లో టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యం కాని మరో రికార్డ్ కూడా అందుకున్నారు నాని. ఓవర్సీస్‌లో ఒకే ఏడాది రెండు 1.5 మిలియన్ సినిమాలు ఇచ్చిన హీరోగా చరిత్ర సృష్టించారు. దీనికి ముందు 2017లో మూడు 1 మిలియన్ మూవీస్ ఇచ్చారు నాని.

ఎలా చూసుకున్నా.. 2017 తర్వాత 2023 నానికి గుర్తుండిపోయింది. అయితే ఒక్కటి మాత్రం నానిని వెంటాడుతుంది. నానిని రొటీన్ సినిమాలు చేసినపుడు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్న ఆడియన్స్.. కాస్త కొత్తగా ప్రయత్నిస్తే మాత్రం పక్కన బెడుతున్నారు.

అప్పుడెప్పుడో భీమిలి కబడ్డీజట్టు నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. రొటీన్ స్టోరీస్ అని పెదవి విరిచిన నేను లోకల్, ఎంసిఏ, దసరా లాంటి సినిమాలు 40 నుంచి 65 కోట్ల షేర్ వసూలు చేస్తే.. జెర్సీ, శ్యామ్ సింగరాయ్, హాయ్ నాన్న 30 కోట్ల దగ్గరే ఆగిపోయాయి.

నాని కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే జెర్సీనే. కానీ దీనికి 30 కోట్లు కూడా రాలేదు. శ్యామ్ సింగరాయ్ పరిస్థితి ఇంతే. తాజాగా హాయ్ నాన్న కూడా నెమ్మదిగా 30 కోట్ల క్లబ్‌లో చేరింది.

దసరా తొలిరోజు 17 కోట్లు తెస్తే.. హాయ్ నాన్నకు వారం పట్టింది. ఈ లెక్కన నానిని ఆడియన్స్ రొటీన్ కథల్లో చూడాలనుకుంటున్నారా..? ఇక్కడ ఆయన మారాలా లేదంటే ఆడియన్స్ మారాలా అనేది అర్థం కాని బ్రహ్మపదార్థం.




