- Telugu News Photo Gallery Cinema photos Superstar Mahesh Babu Guntur kaaram Movie in Sankranthi 2024 race clarity Telugu Heroes Photos
Mahesh Babu – Guntur Kaaram: గుంటూరు కారం అప్డేట్స్ లో కనిపించని సంక్రాంతి హడావుడి.. క్లారిటీ.
ఏం జరిగిందన్నది కాదు డూడ్.. మాకు అప్‌డేట్ వచ్చిందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్ అని అంటున్నారు సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్. సంక్రాంతి రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన గుంటూరు కారం గురించి మంచి అప్‌డేటే అందింది అభిమానులకు. గుంటూరు కారం నుంచి విడుదలైన పాటలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ పాటకాపాట సూపర్ గురూ అంటూ మెచ్చుకుంటున్నారు సూపర్‌స్టార్ సైన్యం. తమన్ మ్యూజిక్ ఫిదా చేస్తోందని అంటున్నారు మ్యూజిక్ లవర్స్.
Updated on: Dec 20, 2023 | 8:44 PM

ఏం జరిగిందన్నది కాదు డూడ్.. మాకు అప్‌డేట్ వచ్చిందా? లేదా? అన్నదే ఇంపార్టెంట్ అని అంటున్నారు సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్. సంక్రాంతి రిలీజ్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసిన గుంటూరు కారం గురించి మంచి అప్‌డేటే అందింది అభిమానులకు.

గుంటూరు కారం నుంచి విడుదలైన పాటలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఏ పాటకాపాట సూపర్ గురూ అంటూ మెచ్చుకుంటున్నారు సూపర్‌స్టార్ సైన్యం. తమన్ మ్యూజిక్ ఫిదా చేస్తోందని అంటున్నారు మ్యూజిక్ లవర్స్.

బుర్రిపాలెం బుల్లోడంటే తెలియనోడు లేడు అంటూ దమ్ మసాలా బిర్యానీ సాంగ్‌ని మాస్‌కి నచ్చే ప్రేమ పదార్థంలా ఆల్రెడీ వడ్డించేశారు త్రివిక్రమ్ అండ్ బృందం. ఆ తర్వాత రిలీజైన ఓ మై బేబీ కూడా అంతే స్పీడ్‌గా జనాల్లోకి దూసుకెళ్లింది.

నా ఊపిరి గాలిని పెర్‌ఫ్యూమ్ అల్లే చుట్టేస్తావే అంటూ లవ్ సాంగ్‌ను యూత్‌కి నచ్చేలా క్రియేట్ చేశారు యూనిట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మాస్ సాంగ్ కూడా అంతకు మించి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు జనాలు.

అయితే ఈ పాట మహేష్‌కి నచ్చలేదనే మాట వైరల్ అయింది. మహేష్‌కి నచ్చలేదనే మాటలో నిజం లేదని అంటున్నారు మేకర్స్. ఆల్రెడీ మూడు పాటల షూటింగ్ పూర్తయిందని, ఇంకో ఫుల్ సాంగ్, బిట్ సాంగ్ ఉన్నాయని చెప్పారు.

ఈ నెల 21 నుంచి నెక్స్ట్ సాంగ్ షూటింగ్ ఉంటుందని హింట్ ఇచ్చారు. ఫేక్ న్యూస్‌లకు స్పందించడం లేదంటే అందులో నిజం లేదని అర్థమంటూ స్పష్టం చేశారు.




