- Telugu News Photo Gallery Cinema photos What About Chiyaan Vikram and Gautham menon Movie Dhruva nakshatram Update Telugu Heroes Photos
Vikram – Dhruva nakshatram: చాలాకాలం క్రితం మొదలైన ధృవనక్షత్రం.. ఇంకెప్పుడు తెరపైకి వస్తుంది.?
సాధారణంగా సక్సెస్ జోష్‌లో ఉన్న హీరో సినిమాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు అందరూ హిట్ హీరోల సినిమాల కోసం క్యూ కడతారు. కానీ ఒక్క స్టార్ హీరో విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కూడా ఆ హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కోలీవుడ్ స్క్రీన్ మీద ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి హీరో విక్రమ్..
Updated on: Dec 20, 2023 | 9:29 PM

సాధారణంగా సక్సెస్ జోష్‌లో ఉన్న హీరో సినిమాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు అందరూ హిట్ హీరోల సినిమాల కోసం క్యూ కడతారు. కానీ ఒక్క స్టార్ హీరో విషయంలో మాత్రం ఈ ఫార్ములా రివర్స్ అవుతోంది.

బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కూడా ఆ హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కోలీవుడ్ స్క్రీన్ మీద ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి హీరో విక్రమ్.

రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వన్‌తో సూపర్ హిట్ అందుకున్న విక్రమ్, తన నెక్ట్స్ సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన రెండు సినిమాలు రిలీజ్ విషయంలో తంటాలు పడుతున్నాయి.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చాలా కాలం క్రితమే ధృవ నక్షత్రం సినిమా చేశారు విక్రమ్. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆర్ధిక సమస్యలతో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తోంది.

పీఎస్ 2 రిలీజ్ తరువాత ధృవ నక్షత్రం టీమ్‌లో కదలిక కనిపించినా.. ఇంతవరకు రిలీజ్ మాత్రం కాలేదు. ఇప్పుడు తంగలాన్ విషయంలోనూ పరిస్థితి అలాగే ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్న రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావటం లేదు. ముందు డిసెంబర్ అన్నారు, తరువాత పొంగల్ అన్నారు.

ఆ తరువాత రిపబ్లిక్ డేకి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఆ డేట్‌కి కూడా రిలీజ్ కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇలా విక్రమ్ సినిమాలు వరుసగా వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.




