- Telugu News Photo Gallery Cinema photos Ranbir Kapoor's fans and Bollywood are also hotly debated that Animal movie will collect 1000 crores or not.
Animal: యానిమల్‌ను ఆ రికార్డుకు దూరం చేస్తున్నదెవరు..? బాలీవుడ్‌లో నెక్ట్స్ 1000 కోట్లు కొట్టేదెవరు..?
యానిమల్ సినిమాకు 1000 కోట్లు వస్తాయా లేదా..? రణ్‌బీర్ కపూర్ అభిమానులతో పాటు బాలీవుడ్‌లోనూ భీభత్సమైన చర్చ జరుగుతుంది దీనిపై ఇప్పుడు. మూడో వీకెండ్ కూడా రెచ్చిపోయాడు యానిమల్. ఇంతగా జోరు చూపిస్తున్నా.. 1000 కోట్లైతే కాస్త కష్టమే. మరి యానిమల్‌ను ఆ రికార్డుకు దూరం చేస్తున్నదెవరు..? బాలీవుడ్‌లో నెక్ట్స్ 1000 కోట్లు కొట్టేదెవరు..?
Updated on: Dec 20, 2023 | 4:04 PM

1000 కోట్లు అంటే ఒకప్పుడు నోరెళ్లబెట్టేవాళ్లేమో కానీ ఇప్పుడంత సీన్ లేదు. సినిమా కాస్తా బాగుండి.. పాన్ ఇండియన్ మార్కెట్ ఉంటే చాలు వద్దన్నా 1000 కోట్లు వచ్చేస్తున్నాయి.

అయితే బాలీవుడ్ సినిమాలకు మాత్రం కాస్త దూరంగానే ఉంది ఈ రికార్డ్. ఎందుకంటే బాహుబలి, కేజియఫ్, ట్రిపుల్ ఆర్ హిందీ నుంచే వందల కోట్లు వసూలు చేస్తే.. హిందీ సినిమాలకు ఇక్కడ్నుంచి 100 కోట్లు కూడా రావట్లేదు.

సౌత్ నుంచి పెద్దగా సపోర్ట్ లేకపోయినా.. తన ఓవర్సీస్ స్టామినాతో జవాన్, పఠాన్‌తో 1000 కోట్లు కొట్టారు షారుక్ ఖాన్. కానీ రణ్‌బీర్ కపూర్ మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోతున్నారు.

అయినా కూడా తన మార్కెట్‌కు మించి యానిమల్‌తో 850 కోట్లు వసూలు చేసారు ఈ హీరో. కానీ 1000 కోట్లు మాత్రం కష్టమే. ఎందుకంటే డిసెంబర్ 21న డంకీ, 22న సలార్‌తో పాటు ఆక్వామెన్ వస్తున్నాయి.

1000 కోట్లకు మరో 150 కోట్ల దూరంలో ఆగిపోయింది యానిమల్. సలార్, డంకీ వచ్చిన తర్వాత యానిమల్‌కు థియేటర్స్ భారీగా తగ్గిపోతాయి కాబట్టి థౌజెండ్ వాలా పేల్చడం కాస్త కష్టమే. సౌత్ నుంచి అన్ని భాషల్లో కలిపి 100 కోట్ల వరకే వచ్చాయి. అదే 200 కోట్లు వచ్చుంటే.. 1000 టచ్ అయ్యేదేమో..? 2023 పూర్తవ్వడానికి మరో 10 రోజుల టైమ్ ఉంది. మరి చూడాలిక.. సలార్, డంకీల్లో ఎవరు థౌజెండ్ వాలా పేలుస్తారో..?




