AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sagileti Katha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రాయలసీమ లవ్‌ స్టోరీ.. సగిలేటి కథను ఎందులో చూడాలంటే?

ప్రమోషన్ల లోపమో, ఇతర కారణాలతో బిగ్‌ స్క్రీన్‌పై ఎక్కువ రోజులు నిలవని సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌పై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అలా థియేటర్లలో పెద్దగా ఆడని ఒక చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది

Sagileti Katha OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రాయలసీమ లవ్‌ స్టోరీ.. సగిలేటి కథను ఎందులో చూడాలంటే?
Sagileti Katha Movie
Basha Shek
|

Updated on: Dec 23, 2023 | 4:31 PM

Share

ఈ మధ్యన థియేటర్లలో ఆడని సినిమాలు కూడా ఓటీటీలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్ల లోపమో, ఇతర కారణాలతో బిగ్‌ స్క్రీన్‌పై ఎక్కువ రోజులు నిలవని సినిమాలు డిజిటల్‌ స్ట్రీమింగ్‌పై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకుంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అలా థియేటర్లలో పెద్దగా ఆడని ఒక చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చింది. అదే హీరో నవదీప్‌ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ‘సగిలేటి కథ’. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్‌. రాయలసీమ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ప్రేమ, పగ, ద్వేషాలతో కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు, రచయిత బత్తుల ప్రసాదరావు రాసిన ‘సగిలేటి కథలు’లోని ‘కూరకి సచ్చినోడు’ అనే కథను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్. రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో నరసింహా ప్రసాద్ పంతగాని ,రాజశేఖర్ అనింగి, రమని, రమేష్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 13న థియేటర్లలో విడుదలైన సగిలేటి కథ పెద్దగా ఆడలేదు. ప్రమోషన్లు సరిగా నిర్వహించకపోవడం, దసరా సీజన్‌ కావడం, బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. థియేటర్లలో నిరాశపర్చిన సగిలేటి కథ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌ సగిలేటి కథ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే శుక్రవారం (డిసెంబర్‌ 22) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది.

దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించిన సగిలేటి కథ సినిమాలో అందరూ కొత్త వాళ్లే. గతంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించిన వారే. సినిమా కథ కూడా సింపుల్‌గా ఉంటుంది. రాయల సీమలోని స‌గిలేరు అనే ఊరిలో ఈ కథ జరుగుతుంది. గంగాల‌మ్మ జాత‌ర చేయాల‌ని ఆ ఊరి పెద్దలందరూ సంక‌ల్పిస్తారు. అయితే ఆ జాత‌రలో జ‌రిగిన‌ గొడ‌వ‌లో ఊరి పెద్ద చౌడ‌ప్ప…ఆర్ఎంపీ డాక్టర్‌గా ప‌నిచేసే దొర‌సామిని చంపేస్తాడు. దొర‌సామి కూతురు కృష్ణవేణిని చౌడ‌ప్ప కుమారుడు కుమార్ ప్రాణంగా ప్రేమిస్తాడు. మరి జాతరలో జరిగిన గొడవలతో కృష్ణవేణి, కుమార్‌ల ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఇద్దరూ ఎలా ఒక్కటయ్యరన్నదే సగిలేటి కథ మూవీ స్టోరీ. సున్నితమైన హాస్యంతో తెరకెక్కిన ఈ మూవీని థియేటర్లలో మిస్‌ అయ్యుంటే మాత్రం ఒకసారి ఓటీటీలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.