Pallavi Prashanth: ‘పల్లవి ప్రశాంత్ అమాయకుడు.. అరెస్ట్ బాధాకరం’.. రైతు బిడ్డకు అండగా ‘బిగ్ బాస్’ కౌశల్
మన్ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీని గెల్చుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు రైతు బిడ్డకు. గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన ఘటనలు, పరిణామాలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌పై..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షో బాగా వార్తల్లో నిలుస్తోంది. గ్రాండ్ ఫినాలే ముగిశాక కూడా తరచూ ఏదో ఒక విషయంలో బిగ్ బాస్ పేరు వినపడుతూనే ఉంది. ముఖ్యంగా ఏడో సీజన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. కామన్ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీని గెల్చుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు రైతు బిడ్డకు. గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన ఘటనలు, పరిణామాలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌పై పోలీస్ కేసులు నమోదయ్యాయి. రైతు బిడ్డతో పాటు అతని సోదరుడు, అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ వెంటనే ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడ జైలుకు కూడా వెళ్లాడు ప్రశాంత్. అయితే ఎట్టకేలకు శుక్రవారం అతనికి బెయిల్ లభించింది. శని, ఆది సోమవారాలు వరుసగా సెలవులు రావడంతో మంగళవారం బిగ్ బాస్ విజేత బయటకు రావచ్చు. అయితే ఘర్షణ విషయంలో పల్లవి ప్రశాంత్ ఒక్కడినే బాధ్యుడిని చేయడంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. రైతు బిడ్డకు బహిరంగంగానే తమ మద్దతు తెలియజేస్తున్నారు. శివాజీ, భోలే షావలి, టేస్టీ తేజా, ప్రియాంక, అశ్విని శ్రీ తదితరులు ప్రశాంత్ అరెస్ట్‌పై స్పందించారు. అతను త్వరగా బయటకు రావాలని ఆకాంక్షించారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా పల్లవి ప్రశాంత్ అరెస్టుపై రియాక్ట్ అయ్యాడు.
ఒక కామన్ మ్యాన్‌గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం బాధాకరం. అతను చాలా అమాయకుడు. కొంతమంది పబ్లిసిటీ కోసం అలా దాడి చేయడం చేసారు. పల్లవి ప్రశాంత్ కేవలం తనకి ఓటు వేసిన ప్రతి ఒక్కరిని కలవాలి, థాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్లీ అభిమానులను పలకరించడానికి తిరిగి వచ్చిఉంటాడు. అంతమాత్రాన ఫ్యాన్స్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదు. అవి పూర్తిగా చట్ట వ్యతిరేక చర్యలు. ఆ ఆ దాడులకు పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదు’ అని కౌశల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పల్లవి ప్రశాంత్, కౌశల్ కు మద్దతుగా పలువురు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కౌశల్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.