12th Fail OTT: ఓటీటీలోకి ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీ 12th ఫెయిల్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

అక్టోబర్‌ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్‌ టాక్‌ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. విద్యావ్యవస్థ లోని లోటు పాట్లతో పాటు సివిల్స్‌ కోసం సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్‌ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు డైరెక్టర్‌.

12th Fail OTT: ఓటీటీలోకి ఆస్కార్‌ నామినేటెడ్‌ మూవీ 12th ఫెయిల్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
12th Fail Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2023 | 8:18 PM

ఈ ఏడాది బాలీవుడ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమాల్లో 12th ఫెయిల్‌ ఒకటి. మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్ ఆఫీస‌ర్ జీవితం ఆధారంగా ఎంతో హృద్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్‌ హీరో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్‌ టాక్‌ తోనే భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. విద్యావ్యవస్థ లోని లోటు పాట్లతో పాటు సివిల్స్‌ కోసం సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్‌ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారు డైరెక్టర్‌. విద్యార్థులు, తల్లిదండ్రుల మనసుల్ని కదిలించేలా తెరకెక్కిన ఈ బయోపిక్‌ మూవీ ఆడియెన్స్‌ను బాగా అలరించింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్‌ మూవీ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5 ఈ బయోపిక్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 5న తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 12th ఫెయిల్‌ మూవీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‌ కు రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

12th ఫెయిల్ సినిమాలో మ‌నోజ్ కుమార్ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో విక్రాంత్ మస్సే అద్బుతంగా నటించాడు. 12వ త‌ర‌గ‌తిలో ఫెయిల్ అయిన అతను పొట్ట కూటి కోసం ఆటో డ్రైవర్‌గా మారుతాడు. అయితే తన కలల ప్రయాణాన్ని మాత్రం వదులు కోడు. చివరకు ఆ ఆటో డ్రైవర్‌ ఐపీఎస్‌గా ఎలా సెలెక్డ్‌ అయ్యాడన్నది 12th ఫెయిల్ మూవీలో ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా చూపించారు. ఇందులో మేధా శంకర్‌, అనంత్ జోషి, అన్షుమాన్‌ పుష్కర్‌, ప్రియాంశు చటర్జీ, గీతా అగర్వాల్‌, హరీష్‌ ఖన్నా, సరితా జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వినోద్‌ చోప్రా ఫిల్మ్స్‌పై విధు వినోద్‌ చోప్రా, యోగేష్‌ ఈశ్వర్‌ ఈ మూవీని నిర్మించారు. శంతాను మొయిత్రా స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

జీ 5 లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.