Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌.. గజ్వేల్‌లో అదుపులోకి తీసుకొన్న పోలీసులు

బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్టయ్యాడు. గజ్వేల్‌లో పోలీసులు రైతు బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవలు, ఆతర్వాత పరిణామాలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌ పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి.

Pallavi Prashanth: బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌.. గజ్వేల్‌లో అదుపులోకి తీసుకొన్న పోలీసులు
Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 20, 2023 | 7:37 PM

బిగ్‌ బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్టయ్యాడు. గజ్వేల్‌లో పోలీసులు రైతు బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవలు, ఆతర్వాత పరిణామాలకు సంబంధించి పల్లవి ప్రశాంత్‌ పై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో రైతు బిడ్డను A1 గా చేర్చారు పోలీసులు. అలాగే అతని తమ్ముడిని A2 గా చేర్చారు. వీరితో పాటు అతని స్నేహితులు, అభిమానులపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం (డిసెంబర్ 17) బిగ్ బాస్ ఫైనల్స్ తర్వాత జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కంటెస్టెంట్స్‌ బయటకు వచ్చిన సమయంలో విధ్వంస కాండ జరిగింది. అభిమానులు ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్‌ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సాయి కిరణ్, రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పబ్లిక్‌ను గేదర్‌ చేయడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, తుంటరి చర్యలకు పాల్పడడం, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్ కింద పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు అయ్యాయి. ఘటన సమయంలో రాళ్లదాడి జరుగుతుండడంతో అక్కడినుంచి ప్రశాంత్‌ను వెళ్ళిపోవాలని పోలీసులు కోరినా…అతడు వినకపోవడంతోనే కేసులు నమోదయ్యాయనేది పోలీస్‌ వెర్షన్‌. ఇప్పటికే ఈ ఘటనలో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను A1గా చేర్చారు పోలీసులు. ఐపిసి 147, ఐపిసి 148, 290 353 427 రెడ్ విత్ 149 ఐపిసి సెక్షన్ 30 యాక్ట్ కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే తానెక్కడికి పారిపోలేదని తన మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాపోతున్నాడు పల్లవి ప్రశాంత్‌. ఆ నలుగురితోనే తనకు థ్రెట్‌ ఉందని చెబుతున్నాడు. తాను ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడంతో కొందరు తనను ఇలా బద్నామ్‌ చేస్తున్నారంటున్నాడు ప్రశాంత్‌. తనకేదైనా అయితే వాళ్లదే బాధ్యత అంటున్నాడు. పోలీసులు చెప్పింది తనకు వినపడకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందంటున్నాడు ప్రశాంత్‌. తనకేదైనా అయితే ఆ ఐదుగురి ఫొటోలు బయటపెడతానంటున్నాడు పల్లవి ప్రశాంత్‌.  మరోవైపు పోలీసులపై మండిపడ్డారు ప్రశాంత్‌ తరఫు అడ్వకేట్ రాజేష్ కుమార్. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదన్నారు ఆయన. FIR కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నామని, ఈ కేసు లో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తే తెలుస్తుందంటున్నారు అడ్వొకేట్‌ రాజేష్‌. బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఎంత డ్రామా ఉంటుందో….పల్లవి ప్రశాంత్‌ కేసు అంతకుమించిన డ్రామాతో సాగుతోంది. రోజుకో మలుపుతో ట్విస్టుల మీద ట్విస్టులతో నడుస్తోంది. బిగ్‌ బాస్‌ ఎపిసోడ్‌లో చివరకు విన్నర్‌గా నిలిచినట్లు…ఈ రియల్‌ ఎపిసోడ్‌లో కూడా కేసు నుంచి బయటపడాలని, తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాడు ప్రశాంత్‌.

పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.