Prabhas – Salaar: ప్రభాస్‌కు రేవంతన్న బంపర్ ఆఫర్.! టికెట్స్ రేట్స్ పై క్లారిటీ..
సలార్ మేనియా పీక్స్‌లో ఉంది. ఈ మూవీ టికెట్ల కోసం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హోరా హోరా గా పోటీ పడడం కనిపిస్తోంది. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకోవడం.. నెట్టింట చర్చించుకోవడం ఎక్కువైంది. ఇక దానికి తోడు... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...డార్లింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. టికెట్ల రేట్లను సలార్‌కు కలెక్షన్స్‌ను కలిసివచ్చేలా పెంచేందుకు అనుమతినిచ్చాయి.
సలార్ మేనియా పీక్స్‌లో ఉంది. ఈ మూవీ టికెట్ల కోసం థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హోరా హోరా గా పోటీ పడడం కనిపిస్తోంది. ఈ సినిమా గురించే అందరూ మాట్లాడుకోవడం.. నెట్టింట చర్చించుకోవడం ఎక్కువైంది. ఇక దానికి తోడు… రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. డార్లింగ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. టికెట్ల రేట్లను సలార్‌కు కలెక్షన్స్‌ను కలిసివచ్చేలా పెంచేందుకు అనుమతినిచ్చాయి. తెలంగాణాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కో టికెట్‌పై 65 రూపాయిలు, మల్టీప్లెక్స్‌లో అయితే 100 రూపాయలు పెంచుకునేందుకు తాజాగా రేవంత్ ప్రభుత్వం సలార్ మేకర్స్‌కు అనుమతినిచ్చింది. దీంతో ఈ మూవీ టికెట్ రేట్ సింగిల్ స్క్రీన్స్‌లో 253, మల్టిప్లెక్స్‌లలో 413కు చేరుకుంది. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్క సింగిల్ స్క్రీన్స్ లోనే.. ఉన్న టికెట్ రేట్‌పై 40 పెంచుకోవచ్చు సలార్ మూవీ మేకర్స్కు అనుమతినిచ్చింది. దీంతో ఏపీలో సింగిల్ స్క్రీన్ రేట్ 165రూపాయలకు… చేరుకుంది. మల్టిప్లెక్స్ రేట్ 225గా యథాతథంగా ఉంది.ఇక ఈ ఎక్స్‌ట్రా రేట్స్ ఏపీలో పది రోజులు.. తెలంగాణలో వారం రోజుల వరకే అమల్లో ఉండనుంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న సలార్ సినిమాను గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే యూఎస్ లో సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ సలార్ టికెట్ హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. ఇక తెలుగు స్టేట్స్ విషయానికొస్తే ఇక సలార్ సినిమా డిసెంబర్ 22న భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ సినిమా పై ఉన్న అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఈ సినిమాలోపృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.