AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, December 23rd episode: అనామిక తండ్రి పీక పట్టుకున్న అప్పూ.. కావ్య, పద్మావతిల కొంప ముంచేందుకు విలన్ గ్యాంగ్ ప్లాన్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక తండ్రి, తల్లి అప్పూని తిడతారు. కాదని కనకం వారిస్తున్నా.. శైలు, సుబ్రమణ్యం అర్థం చేసుకోకుండా.. కనకం ఫ్యామిలీ గురించి నోరు పారేసుకుంటారు. కనకం గురించి చాలా అసహ్యంగా మాట్లాడతారు. దీంతో అప్పూకి పట్టలేనంత కోపం వచ్చి.. సుబ్రమణ్యం షర్టు పట్టుకుంటుంది. ఇంకోసారి మా అమ్మ, నాన్నల గురించి మాట్లాడితే.. మంచిగా ఉండదు చంపేస్తా అని షర్టు పట్టుకుని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. దీంతో అప్పూని పక్కకి లాగి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. మా అమ్మాయి చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా..

Brahmamudi, December 23rd episode: అనామిక తండ్రి పీక పట్టుకున్న అప్పూ.. కావ్య, పద్మావతిల కొంప ముంచేందుకు విలన్ గ్యాంగ్ ప్లాన్..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Dec 23, 2023 | 11:33 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అనామిక తండ్రి, తల్లి అప్పూని తిడతారు. కాదని కనకం వారిస్తున్నా.. శైలు, సుబ్రమణ్యం అర్థం చేసుకోకుండా.. కనకం ఫ్యామిలీ గురించి నోరు పారేసుకుంటారు. కనకం గురించి చాలా అసహ్యంగా మాట్లాడతారు. దీంతో అప్పూకి పట్టలేనంత కోపం వచ్చి.. సుబ్రమణ్యం షర్టు పట్టుకుంటుంది. ఇంకోసారి మా అమ్మ, నాన్నల గురించి మాట్లాడితే.. మంచిగా ఉండదు చంపేస్తా అని షర్టు పట్టుకుని వార్నింగ్ ఇస్తుంది అప్పూ. దీంతో అప్పూని పక్కకి లాగి కొట్టడానికి చేయి ఎత్తుతాడు. మా అమ్మాయి చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా అంటాడు కృష్ణ మూర్తి. మీ అమ్మాయి జీవితంలోకి మా అప్పూ ఎప్పుడూ అడ్డు రాదని చెప్తుంది కనకం. ఆ తర్వాత ఎవరికి వారు వెల్లి పోతారు.

Brahmamudi

కావ్య, స్వప్నలకు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చిన పద్మావతి..

మరోవైపు అరుణ్ కోసం స్వప్న, కావ్యలు వెతుకుతారు. దీంతో స్వప్న తెగ కంగారు పడుతూ ఉంటాడు. ఆ ఆవేశంతో కావ్యని తిడుతుంది స్వప్న. సరిగ్గా అప్పుడే పద్మావతి వచ్చి.. నేను మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. నీకేం సహాయం కావాలి.. నీ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వూ నేనూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామని కావ్య అంటుంది. అయతే నేను అనుకున్నది నిజమే అన్నమాట. నువ్వు కూడా నా పొజిషన్ లో నే ఉన్నావు అని పద్మావతి అంటుంది. ఈలోపు స్వప్న కంగారు పడుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్య, పద్మావతిల కొంప ముంచాలని విలన్ గ్యాంగ్ ప్లాన్..

ఇక రుద్రాణి, రాహుల్, అరుణ్ లు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి ఆగి పోవాలని, స్వప్న ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోవాలని ప్లాన్ చేస్తారు. ఆ మేటర్ అంతా మురళి వినేస్తాడు. సూపర్ ప్లాన్ అంటూ క్లాప్స్ కొడతాడు. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. మీరు ఎలాగ.. పెళ్లి ఆగిపోవాలని చూస్తున్నారో.. నాకు కూడా విక్కీ, పద్మావతిలు విడి పోవడం కావాలని చెప్తాడు. ఇక అందరూ కలిసి కావ్య, పద్మావతిల కొంప ముంచాలని చూస్తారు.

రాజ్, విక్కీలను ఇరికించేసిన కావ్య, పద్దూలు..

అనంతరం అక్కా, తముళ్ల ప్రేమ గురించి ఇందిరా దేవి, సీతా రామయ్య చెబుతూ ఉంటారు. తనకు అక్క ఉండటం వల్ల అదృష్టం అని విక్కీ చెప్తాడు. ఆ ప్రేమను కూడా పద్మావతిపై చూపించాలని విక్రమ్ కి చెప్తుంది కావ్య. ఇదేంటి కావ్య.. నన్ను ఇలా ఇరికించేసిందని పద్దూ మనసులో అనుకుంటుంది. ఇప్పుడు ఈ టెంపరోడు నాపై కోపంతో ఎగురు తాడే ఇప్పుడు నేను ఏం చేయాలని అని పద్మావతి అనుకుంటుంది. ఆ తర్వాత కావ్యని ఇరికిస్తుంది పద్మావతి. దీంతో కావ్య, రాజ్ లు కూడా మనసులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ లోపు కావ్య, పద్దూలు తప్పించుకుంటారు. ఈలోపు స్వప్న మాత్రం అరుణ్ గురించి కంగారు పడుతూ ఉంటుంది.

మురళి బాగోతం అరవిందకు చెప్పేందుకు ట్రై చేసిన కావ్య..

ఈ సీన్ కట్ చేస్తే.. నగలు, మేకప్ లు, చీరల గురించి మాట్లాడుకుంటారు. ఈ లోపు ప్రకాష్ పక్కన ఎవర్నీ చూసుకోకుండా.. వచ్చి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఇక కుచల కుమారికి ఒక బిస్కెట్ ఏస్తాడు. ఆ తర్వాత నారు వచ్చి.. మేకప్ సామాను తీసుకొస్తాడు. ఈ సీన్ నిజంగానే నవ్వులు తెప్పిస్తుంది. ఇక అక్కడే పెళ్లికి వచ్చిన ఓ అమ్మాయితో పులిహోర కలిపేస్తాడు మురళి. ఈ సీన్ చూసిన కావ్య మురళి విషయం.. అరవిందను పిలిచి చెప్పే ప్రయత్నం చేస్తుంది కావ్య. సరిగ్గా అదే టైమ్ కి అరవింద వస్తుంది. దీంతో కావ్య చెప్పే ప్రయత్నం చేసి.. మళ్లీ అరవింద గురించి ఆలోచించి.. వదిలేస్తుంది. ఇంతలో మెహందీకి టైమ్ అవుతుంది రమ్మని.. పద్మావతి పిలుస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్తారు. ఇక ఊపిరి పీల్చుకున్న మురళి.. అమ్మో కావ్యతో జాగ్రత్తగా ఉండాలి అనుంటాడు.

ఈ పెళ్లి తర్వాత ఊరి వదిలి వెళ్లి పోదాం: కనకం

ఈలోపు అప్పూ కోసం కృష్ణ మూర్తి, కనకం బాధ పడతారు. తన బాధను అంతా లోపలే పెట్టుకుని కుమిలి పోతుందని అనుకుంటారు. అప్పూ గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉందనుకుంటారు. ఈ పెళ్లి అయిపోయాక అప్పూని దూరంగా తీసుకెళ్లిపోదాం అనుకుంటారు. వాళ్లు కూడా పెళ్లి జరగాలనే గొడవ చేయాలేదని కనకం అంటుంది. మరోవైపు కల్యాణ్‌ కు అప్పు ప్రేమ విషయం చెప్పాలని బయలుదేరుతాడు చోటు.

రాజ్, విక్కీలకు రోమాంటిక్ టచ్..

ఆ తర్వాత పద్దూ, విక్కీ చీర విషయంలో గొడవ పడతారు. నా భార్య ఇలా ఉండకూడదని చెప్తూ విక్కీ అంటే మీరే రెడీ చేయమని పద్దూ అంటుంది. దీంతో విక్కీ ఒప్పుకుంటాడు. దాంతో పద్మావతిని అందంగా రెడీ చేస్తాడు విక్కీ. ఇక వీళ్ల లాగే కావ్య కూడా చీర మార్చకుంటాను అంటే రాజ్ ఓకే చెప్తాడు. మాట మీద ఉంటారా అని కావ్య అంటే రాజ్ అవును అంటాడు. మీరు నన్ను చూడకండి.. చీర కట్టుకుంటాను అని కావ్య అంటే.. అలాగే అంటాడు రాజ్. ఇక కావ్య బ్యాక్ చూసి టెంప్ట్ అవుతాడు రాజ్. గుండెల్లో గంటలు మోగుతున్నాయేంటి.. అని కంగారు పడి బయటవెళ్ల బోతాడు రాజ్. దీంతో కావ్య రాజ్ చేయి పట్టుకుని కావాలనే ఆట పట్టిస్తుంది. సరిగ్గా అప్పుడే విక్రమాదిత్య బయట ఉంటాడు. వాళ్లిద్దరూ ఇక ఆడవాళ్ల చీరల గురించి ఆలోచించుకుంటారు. తర్వాత అప్పుడు కావ్య, పద్దూ అందంగా తయారై వస్తారు. వాళ్లను చూసి రాజ్, విక్కీ షాక్ అయిపోతారు. ఇక నలుగురు కలిసి.. మెహందీ ఫంక్షన్ కు వెళ్తారు.

నన్ను కళ్యాణ్ ఆడదానిలాగే గుర్తించట్లే.. బాధ పడుతున్న అప్పూ..

ఈ సీన్ కట్ చేస్తే.. మెహందీ ఫంక్షన్ కి అప్పూని కనకం రమ్మంటే రానని అంటుంది. నన్ను నన్నుగా కళ్యాణ్ ఏనాడూ చూడలేదు. ఒక అబ్బాయిగానే చూశాడు. ఇక ఎప్పుడు నాకు ఆడదాన్ని అనే ఫీల్ వస్తది. అప్పుడప్పుడు మీరు చెప్తేనే నేను ఆడ పిల్లలని గుర్తుకు వస్తుంది. ఇక జరిగిందంతా గుర్తుకు వచ్చి ఏడుపు కూడా వస్తుందని అంటే.. కనకం అప్పూని ఓదార్చుతుంది. దీంతో కనకం, కృష్ణ మూర్తులు వెళ్తారు. మరోవైపు మందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు నారు. సరిగ్గా అప్పుడే మందు బాటిల్ తో వస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.