- Telugu News Photo Gallery Cinema photos South Directors who have shown thier worth in the North like Sandeep Reddy Vanga, Atlee, Prashanth Neel
నార్త్ లో సత్తా చాటిన దక్షిణాది డైరెక్టర్లు
మిగిలిన సంవత్సరాలన్నీ ఓ లెక్క.. 2023 ఇంకో లెక్క అంటున్నారు సౌత్ కెప్టెన్స్. ఉత్తరాది వీధుల్లో సౌతిండియన్స్ కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేసిన మన కెప్టెన్లు ఎవరెవరు? వందలు దాటి, వేలకు చేరువయి... స్టిల్‌కౌంటింగ్ అంటూ బాక్సాఫీస్‌ని దడదడలాడిస్తున్న సినిమాలేంటి? చూసేద్దాం రండి. ఫస్ట్ వీక్ మాకు సరైన థియేటర్లు పడలేదుగానీ, అనుకున్న ప్రకారం గ్రాండ్ రిలీజ్ అయి ఉంటే ఇప్పుడొచ్చిన 800కోట్ల ప్లస్ కలెక్షన్లకు అదనంగా ఇంకో 200 కోట్లు గ్యారంటీగా వచ్చి ఉండేవని అంటున్నారు యానిమల్ మేకర్స్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Dec 29, 2023 | 6:22 PM

మిగిలిన సంవత్సరాలన్నీ ఓ లెక్క.. 2023 ఇంకో లెక్క అంటున్నారు సౌత్ కెప్టెన్స్. ఉత్తరాది వీధుల్లో సౌతిండియన్స్ కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేసిన మన కెప్టెన్లు ఎవరెవరు? వందలు దాటి, వేలకు చేరువయి... స్టిల్‌కౌంటింగ్ అంటూ బాక్సాఫీస్‌ని దడదడలాడిస్తున్న సినిమాలేంటి? చూసేద్దాం రండి....

ఫస్ట్ వీక్ మాకు సరైన థియేటర్లు పడలేదుగానీ, అనుకున్న ప్రకారం గ్రాండ్ రిలీజ్ అయి ఉంటే ఇప్పుడొచ్చిన 800కోట్ల ప్లస్ కలెక్షన్లకు అదనంగా ఇంకో 200 కోట్లు గ్యారంటీగా వచ్చి ఉండేవని అంటున్నారు యానిమల్ మేకర్స్. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఆల్రెడీ అర్జున్‌రెడ్డితో తనకంటూ ఓ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకున్న సందీప్, ఇప్పుడు యానిమల్‌తో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

నేనంటూ నార్త్ కి వెళ్తే ఒక్కడినే వెళ్లను. వెంట సైన్యాన్ని తీసుకెళ్తా. బాలీవుడ్‌లో సౌత్ టెక్నీషియన్ల సత్తా చాటుతానని అనౌన్స్ చేశారు అట్లీ. షారుఖ్ హీరోగా అట్లీ డైరక్షన్‌లో తెరకెక్కింది జవాన్. వెయ్యి కోట్లను దాటిన సినిమాగా ప్రూవ్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్. నయనతార, అనిరుద్‌తో పాటు సౌత్ ఇండియన్స్ చాలా మందే పనిచేశారు ఈ మూవీకి.

షారుఖ్ జవాన్ చూసిన నార్త్ స్టార్స్ అట్లీతో పనిచేయడానికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. అట్లీ ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ అంటూ బాద్షా ఆల్రెడీ పచ్చజెండా ఊపేశారు. అట్లీ డైరక్షన్‌లో షారుఖ్ - విజయ్ మల్టీస్టారర్ ఉంటుందనే మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ డిస్కషన్ లోకి రావడానికి ముఖ్యమైన రీజన్ జవాన్ సక్సెసే.

ముంబై మరాఠా మందిర్ అనగానే షారుఖ్‌ఖాన్ సినిమాలకు అడ్డా అనే పేరు ఉండనే ఉంది. మరి ఇప్పుడు ఆ థియేటర్లోనూ సలార్ ఆడుతోందంటే డార్లింగ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఎన్ని విధాలుగా అనుకున్నా సరే, నా స్టైల్‌లో నేను సినిమా తీసి సక్సెస్ చేస్తానంటూ ఇంకో సారి ప్రూవ్ చేసుకున్నారు ప్రశాంత్ నీల్. ఇలా 2023ని మెమరబుల్ ఇయర్‌గా మార్చేశారు సందీప్ రెడ్డి వంగా, అట్లీ అండ్ ప్రశాంత్ నీల్.





























