- Telugu News Photo Gallery Cinema photos Telugu movies in new trend to film on sea shores like Uppena, Waltair Veerayya, Devara
సముద్ర తీరంలో మన తెలుగు హీరోలు సినిమాలు.. మీరు ఓ లుక్ వేయండి
ఫస్ట్ టైమ్ జరిగినప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండ్ టైమ్ సెంటిమెంట్ అవుతుంది. ఒకటీ, రెండు సార్లు జరిగిందని వరుసగా అందరూ మొదలుపెడితే అది ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అండర్‌వాటర్ సీక్వెన్స్ ఎపిసోడ్స్ షూట్ చేయడం సినిమా ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. సముద్రాల మీద ఫోకస్ చేస్తున్న హీరోల మీద మనం కూడా ఓ లుక్కేసేద్దాం వచ్చేయండి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Dec 29, 2023 | 6:30 PM

ఫస్ట్ టైమ్ జరిగినప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సెకండ్ టైమ్ సెంటిమెంట్ అవుతుంది. ఒకటీ, రెండు సార్లు జరిగిందని వరుసగా అందరూ మొదలుపెడితే అది ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అండర్‌వాటర్ సీక్వెన్స్ ఎపిసోడ్స్ షూట్ చేయడం సినిమా ఇండస్ట్రీలో ట్రెండింగ్‌గా మారింది. సముద్రాల మీద ఫోకస్ చేస్తున్న హీరోల మీద మనం కూడా ఓ లుక్కేసేద్దాం వచ్చేయండి.

ఉప్పెన సినిమా వచ్చినప్పుడు నీ కళ్లు నీలి సముద్రం... అంటూ కుర్రకారు తెగ పాటలు పాడుకున్నారు. సముద్రం మీద తీసిన సన్నివేశాలను చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ఇండస్ట్రీలో తొలి సినిమాతోనే వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా వైష్ణవ్‌తేజ్‌కి ఉప్పెన సినిమా చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్యలోనూ బిగినింగ్ ఎపిసోడ్ సముద్రం మీదే ఉంటుంది. ఆ ఎపిసోడ్‌ని ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించారు కెప్టెన్ బాబీ

ఇప్పటిదాకా మెసేజ్‌లు చెప్పాను... ఇక మాస్ మసాలా కమర్షియల్ మూవీని తీస్తున్నాను అంటూ దేవర గురించి చెప్పి ప్రేక్షకులను ఊరిస్తున్నారు డైరక్టర్ కొరటాల శివ. ఆయన చెప్పిన ఆ విశేషాల కన్నా జనాలను ఊరిస్తున్న విషయం అండర్ వాటర్ సీక్వెన్స్. ఈ ఎపిసోడ్ కోసం శంషాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా సెట్ వేశారన్నప్పటి నుంచీ హైప్ మామూలుగా లేదు. పైగా ఈ సీక్వెన్స్ కోసం తారక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.

అటు ఊడిపిలో సముద్రపు ఎపిసోడ్స్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఇప్పటిదాకా ఎవరూ అటెంప్ట్ చేయని వైవిధ్యమైన లవ్‌స్టోరీతో ఆయన లేటెస్ట్ సినిమా తండేల్ తెరకెక్కుతోంది.ఈ సినిమా కోసం నాగచైతన్య, సాయిపల్లవి శ్రీకాకుళం యాస నేర్చుకున్నారు. అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు, సినిమా ప్రియులందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ సినిమా కాన్సెప్ట్.

అటు కేజీయఫ్ త్రీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా సముద్రపు సన్నివేశాలు కళ్ల ముందు మెదులుతున్నాయి. మొత్తం బంగారాన్ని తీసుకుని సముద్రంలో ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాకీభాయ్ ఏ తీరాన్ని చేరుకున్నారనే ఆసక్తికరమైన ఎపిసోడ్‌తోనే త్రీక్వెల్ మొదలు కావాల్సి ఉంది. దీన్నిబట్టి వచ్చే ఏడాది, ఆ తర్వాత కూడా సముద్రాన్ని బేస్ చేసుకున్న సినిమాలు వెండి తెర మీద హల్‌చల్ చేయడం ఖాయమన్నమాట.





























