Rakul Preet Singh: పెళ్లిపీటలెక్కనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. వెడ్డింగ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌.. వరుడు ఎవరంటే?

ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది రకుల్. ఇప్పటికే బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు రకుల్‌- జాకీ. సినిమా పార్టీలు, ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు లవ్లీ కపుల్‌. అయితే త్వరలోనే తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారట ఈ ప్రేమ పక్షులు.

Rakul Preet Singh: పెళ్లిపీటలెక్కనున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. వెడ్డింగ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌.. వరుడు ఎవరంటే?
Rakul Preet Singh
Follow us
Basha Shek

|

Updated on: Jan 01, 2024 | 6:08 PM

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనుందా? ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది బాలీవుడ్ మీడియా సర్కిళ్లలో. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది రకుల్. ఇప్పటికే బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని ప్రకటించారు రకుల్‌- జాకీ. సినిమా పార్టీలు, ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు లవ్లీ కపుల్‌. అయితే త్వరలోనే తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారట ఈ ప్రేమ పక్షులు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో రకుల్‌- జాకీ భగ్నానీల వివాహం జరగనుందంటూ కొన్ని ఇంగ్లిష్‌ వెబ్‌ సైట్స్‌లో కథనాలు వస్తున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరగనుందట. ఆ తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌, విందు పార్టీలు ఏర్పాటు చేయనున్నారట. ప్రస్తుతం రకుల్ పెళ్లి వార్తలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు రకుల్‌కు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే రకుల్ కానీ, జాకీ భగ్నానీ కానీ వారి కుటుంబ సభ్యులు ఈ పెళ్లి వేడకపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ చిత్రం ‘గిల్లి’తో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి మంచి క్రేజ్‌ సొంతం చేసుకుంది. తమిళ్‌, హిందీ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక జాకీ భగ్నానీ విషయానికొస్తే.. నటుడిగా, నిర్మాతగా బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ‘ఫాల్తు’, ‘అజబ్ గజబ్ లవ్’, ‘వెల్ కమ్ టు కరాచీ’ వంటి సినిమాల్లో నటించారు. ‘సరబ్‌జిత్‌’, ‘మిషన్‌ రాణిగంజ్‌’, ‘కూలీ నెం.1’ వంటి చిత్రాలను నిర్మించారు. కాగా తమ పెళ్లి పనుల నిమిత్తం ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారట రకుల్- జాకీ. బ్యాచిలర్ పార్టీలు చేసుకుంటూ తమ స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారట. త్వరలోనే తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారని టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్..

ప్రియుడితో రకుల్ ప్రీత్ సింగ్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?