Salaar: సలార్ సక్సెస్‌పై మొదటిసారి స్పందించిన ప్రభాస్.. మీరు వేడుక చేసుకోండంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
డిసెంబర్ 22న విడుదలైన సలార్ ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో చిత్రబృందమంతా సంతోషంలో మునిగి తేలుతోంది. అయితే సలార్ సక్సెస్‌పై ప్రభాస్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇంటర్వూలు ఇస్తున్నాడని వార్తలు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో తన సినిమాపై ఒక పోస్ట్ కూడా పెట్టలేదు డార్లింగ్.
సలార్ బ్లాక్ బస్టర్ కావడంతో 2023కు ఘనంగా వీడ్కోలు పలికాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన సలార్ ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో చిత్రబృందమంతా సంతోషంలో మునిగి తేలుతోంది. అయితే సలార్ సక్సెస్‌పై ప్రభాస్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇంటర్వూలు ఇస్తున్నాడని వార్తలు వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో తన సినిమాపై ఒక పోస్ట్ కూడా పెట్టలేదు డార్లింగ్. సోషల్ మీడియాలో ప్రభాస్ పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడం దీనికి కారణమంటున్నారు ఫ్యాన్స్. అయితే ఎట్టకేలకు సలార్ ప్రభంజనంపై స్పందించాడు ప్రభాస్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ షేర్ చేశాడు డార్లింగ్. ‘నేను ఖాన్సార్ భవిష్యత్తును నిర్ణయిస్తాను. మీరంతా కొత్త సంవత్సర వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోండి. ‘సలార్’ను ఆదరించినందుకు ధన్యవాదాలు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు ప్రభాస్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.
అన్‌స్టాపబుల్ సలార్
సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో మెరిశాడు. శ్రియారెడ్డి, బాబీ సింహ, టిను ఆనంద్, కన్నడ గరుడ రామచంద్ర, మధు గురుస్వామి, బాబీ సింహా, బ్రహ్మాజీ, నవీన్ పంజు, బజరంగీ లోకి, దేవరాజ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సలార్ సినిమా ఇప్పటివరకు రూ. 625 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘అన్‌స్టాపబుల్ సలార్. రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు’ అంటూ ట్వీట్ చేసింది.
ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
600 కోట్లను దాటేసిందిగా..
𝑲𝒉𝒂𝒏𝒔𝒂𝒂𝒓… 𝑰’𝒎 𝑺𝒐𝒓𝒓𝒚!
Unstoppable #SalaarCeaseFire has crossed a massive ₹ 𝟔𝟐𝟓 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 💥#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/JFgqX99Ojv
— Salaar (@SalaarTheSaga) January 1, 2024
‘సలార్’ డైలాగ్ ప్రోమో వీడియో చూశారా?
Experience the biggest action entertainer, #SalaarCeaseFire in cinemas near you!
Here’s a new dialogue promo(Telugu) : https://t.co/b9sj3xSHOj#SalaarBoxOfficeStorm #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan… pic.twitter.com/GEks7tKgdm
— Hombale Films (@hombalefilms) December 31, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..