పాత సినిమాలు ఎవరు చూస్తారులే అనుకోవచ్చు కానీ ఆ మధ్య ఆ పాత సినిమాలే కొత్త సినిమాల కంటే ఎక్కువ వసూలు చేసాయి. పోకిరి నుంచి మొదలుపెడితే జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషీ, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్‌లోనూ మ్యాజిక్ చేసాయి. కానీ ఆ తర్వాత అదుర్స్, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలకు కనీస స్పందన కరువైంది.