- Telugu News Photo Gallery Cinema photos Superstar mahesh babu dance moments in Guntur karam Movie Telugu Heroes Photos
Mahesh Babu Dance: ఈ మధ్య డాన్స్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న గుంటూరోడు.
అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎలాంటి విషయాలను పట్టించుకుంటారో సూపర్‌స్టార్‌కి చాలా బాగా తెలుసు. అందుకే ప్రతి సినిమాలోనూ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను మేళవించడానికి ప్రయత్నిస్తున్నారు మహేష్. లేటెస్ట్ గుంటూరు కారం సినిమాలో పాట విన్న వారందరూ వారెవా అంటున్నారు. అప్పుడెప్పుడో చిన్నప్పటి సంగతి కాదు, వేడి వేడిగా ఇప్పుడు ఏం జరిగిందన్నది ఇంపార్టెంట్ అని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.
Updated on: Jan 02, 2024 | 9:38 PM

అభిమాన హీరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎలాంటి విషయాలను పట్టించుకుంటారో సూపర్‌స్టార్‌కి చాలా బాగా తెలుసు. అందుకే ప్రతి సినిమాలోనూ ఫ్యాన్స్ కోరుకునే అంశాలను మేళవించడానికి ప్రయత్నిస్తున్నారు మహేష్.

లేటెస్ట్ గుంటూరు కారం సినిమాలో పాట విన్న వారందరూ వారెవా అంటున్నారు. అప్పుడెప్పుడో చిన్నప్పటి సంగతి కాదు, వేడి వేడిగా ఇప్పుడు ఏం జరిగిందన్నది ఇంపార్టెంట్ అని అంటున్నారు మహేష్ ఫ్యాన్స్.

గుంటూరు కారంలో కుర్చీ సాంగ్ చూసిన వాళ్లందరూ మహేష్ డ్యాన్సుకి ఫిదా అవుతున్నారు. థియేటర్లలో ఈ పాటకు ఈలలు గోలలు మామూలుగా ఉండవన్నది క్రిటిక్స్ మాట. ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే గుంటూరు కారంలో ఊరమాస్ బీట్‌ని ట్రై చేశారు మహేష్.

శ్రీలీలతో పోటాపోటీగా వేసిన డ్యాన్సులు కేక అంటున్నారు ఫ్యాన్స్. ఈ సారి పండగ మనదే బాస్ అంటూ తమ వైపు నుంచి ఫుల్ సపోర్ట్ చేసేస్తున్నారు. మరికొందరైతే మమ మహేశా పాటను గుర్తు చేసుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమాలో మమ మహేషా పాట విడుదలైనప్పుడు క్లాస్‌గా ఉన్న మాస్ బీట్ అంటూ మెచ్చుకున్నారు జనాలు. మహేష్ చార్ట్ బస్టర్ సాంగ్స్ లో మ మ మహేషకి స్పెషల్ ప్లేస్ ఉంది.

ఇప్పుడు దాన్ని మరిపించేలా కుదిరింది కుర్చీ సాంగ్. మహేష్ సినిమాలో మాస్ బీట్ అంటే ఈ మధ్య ఈ పాటలు గుర్తుకొస్తున్నాయి కానీ, స్టైలిష్ మాస్ సాంగ్‌గా పాపులర్ అయింది.

తమన్నాతో కలిసి స్టెప్పులేసిన డాంగ్ డాంగ్ సాంగ్.. పార్టీల్లో ఇప్పటికీ మారుమోగుతోంది.




