Entertainment: చిన్న సినిమా అనుకున్న హనుమాన్ బిజినెస్ తో రికార్డు బ్రేక్స్.!
హనుమాన్ బిజినెస్: తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. దీనికి 21 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 22 కోట్లు వసూలు చేయాల్సిందే. సంక్రాంతికి ఉన్న పోటీలో హనుమాన్ ఎంతవరకు మ్యాజిక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.