SA vs IND: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. మళ్లీ కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా విన్నింగ్‌ టార్గెట్‌ ఎంతంటే?

టీమిండియాకు సువర్ణావకాశం. దక్షిణాఫ్రికాపై గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను సమం చేసేందుకు రోహిత్‌ సేనకు అద్భుత అవకాశం లభించింది. కావాల్సిందల్లా టీమిండియా బ్యాటర్లు కాస్త ఓపికతో బ్యాటింగ్‌ చేయడమే. అలాగనీ భారత విజయ లక్ష్యమేమీ మరీ పెద్దగా ఏమీ లేదు. కానీ పిచ్‌ బౌలర్లకు స్వర్గధామంలా మారింది. కాబట్టి స్వల్ప లక్ష్యమైనా జాగ్రత్తగా ఆడాల్సిందే

SA vs IND: బూమ్‌ బూమ్‌ బుమ్రా.. మళ్లీ కుప్పకూలిన సౌతాఫ్రికా.. టీమిండియా విన్నింగ్‌ టార్గెట్‌ ఎంతంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2024 | 3:55 PM

టీమిండియాకు సువర్ణావకాశం. దక్షిణాఫ్రికాపై గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను సమం చేసేందుకు రోహిత్‌ సేనకు అద్భుత అవకాశం లభించింది. కావాల్సిందల్లా టీమిండియా బ్యాటర్లు కాస్త ఓపికతో బ్యాటింగ్‌ చేయడమే. అలాగనీ భారత విజయ లక్ష్యమేమీ మరీ పెద్దగా ఏమీ లేదు. కానీ పిచ్‌ బౌలర్లకు స్వర్గధామంలా మారింది. కాబట్టి స్వల్ప లక్ష్యమైనా జాగ్రత్తగా ఆడాల్సిందే.  గురువారం (జనవరి 04) భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. మొదటి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. ఓవర్‌ నైట్‌ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు.. 176 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాకు 79 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్‌క్రమ్‌ (106) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే తోటి బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ కు క్యూ కట్టారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. ముకేశ్‌కుమార్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

మర్ క్రమ్ తుఫాన్ సెంచరీ..

దక్షిణాఫ్రికా  రెండో ఇన్నింగ్స్‌లో మార్క్రామ్ అద్భుత సెంచరీ సాధించాడు. ఓవైపు సహచరులు ఒక్కొక్కరు వెనుదిరుగుతున్నా ఫోర్లు, సిక్సర్లతో భారత బౌలర్లపై రెచ్చిపోయాడు. కేవలం 99 బంతుల్లో సెంచరీ సాధించాడు.  ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 17 ఫోర్లు, 2 సిక్స్ లు ఉండడం విశేషం. మర్ క్రమ్ తర్వాత కెప్టెన్ ఎల్గర్ చేసిన 12 పరుగులే సఫారీ జట్టులో రెండో అత్యధిక స్కోరంటే అర్థం చేసుకోవచ్చు సఫారీ బ్యాటర్లు ఎలా ఆడారో.

ఇవి కూడా చదవండి

లంచ్ లోపే చాప చుట్టేసిన సఫారీలు..

బుమ్రా తొమ్మిదో సారి పాంచ్ పటాకా..

టీమ్ ఇండియా ప్లేయింగ్- XI:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్- XI:

డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడాన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ రెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఆండ్రీ బెర్గర్, లుంగి ఎన్‌గిడి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..