IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో.. పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమితో నిరాశలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. T20 ప్రపంచ కప్ 2024 తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 4 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడే అవకాశం ఉంది. జూన్ 5 నుంచి టీమిండియా టీ20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది.

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో.. పాక్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్‌ ఎప్పుడంటే?
India Vs Pakistan
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2024 | 4:40 PM

వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమితో నిరాశలో ఉన్న భారత క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. T20 ప్రపంచ కప్ 2024 తాత్కాలిక షెడ్యూల్ విడుదలైంది. జూన్ 4 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడే అవకాశం ఉంది. జూన్ 5 నుంచి టీమిండియా టీ20 ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. ప్రస్తుతం రిలీజ్‌ చేసిన షెడ్యూల్ ప్రకారం భారత్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఆతర్వాత టీమ్ ఇండియా పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే హైవోల్టేజీ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయని సమాచారం. అలాగే మూడో మ్యాచ్‌లో భారత జట్టు అమెరికాతో తలపడనుంది. టీం ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్‌లో కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫ్లోరిడా వేదికగా జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్‌ పోటీలను వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్నాయి. లీగ్ స్థాయి మ్యాచ్‌లు యూఎస్ఏలో జరగనున్నాయి. సూపర్-8 మ్యాచ్‌లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్ మ్యాచ్ కు కూడా కరేబియన్ దేశం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

T20 ప్రపంచ కప్ భారత జట్టు తాత్కాలిక షెడ్యూల్:

  • జూన్ 5- భారత్ vs ఐర్లాండ్ (న్యూయార్క్)
  • జూన్ 9- భారత్ vs పాకిస్థాన్ (న్యూయార్క్)
  • జూన్ 12- భారత్ vs USA (న్యూయార్క్)
  • జూన్ 15- భారత్ vs కెనడా (ఫ్లోరిడా)

T20 ప్రపంచకప్‌లో పోటీపడే జట్లు:

  • భారతదేశం
  • పాకిస్తాన్
  • ఆఫ్ఘనిస్తాన్
  • ఆస్ట్రేలియా
  • బంగ్లాదేశ్
  • కెనడా
  • ఇంగ్లండ్
  • ఐర్లాండ్
  • నమీబియా
  • నేపాల్
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • ఒమన్
  • పాపువా న్యూ గినియా (PNG)
  • స్కాట్లాండ్
  • దక్షిణ ఆఫ్రికా
  • శ్రీలంక
  • ఉగాండా
  • యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)
  • వెస్ట్ ఇండీస్

క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్యకుమార్ యాదవ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.