AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaathal The Core OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి మమ్ముట్టి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

సాధారణంగా వయసు పెరిగే కొద్ది సినిమా సక్సెస్‌ రేట్‌ కూడా తగ్గుతుంది. అయితే మమ్ముట్టి విషయంలో మాత్రం ఇది రివర్స్‌. గత రెండేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్లే. భీష్మపర్వం, దీ ప్రీస్ట్, సీబీఐ5: ది బ్రెయిన్‌, పుజు, రోస్‌చాక్‌, నాన్‌పకాల్‌ నేరతు మాయక్కం, క్రిస్టోఫర్‌, కన్నూర్‌ స్క్వాడ్‌.. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్నారు మమ్ముట్టి. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మెగాస్టార్‌ సినిమాలకు మంచి స్పందన వస్తుంటుంది.

Kaathal The Core OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి మమ్ముట్టి కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Kaathal The Core Movie
Basha Shek
|

Updated on: Jan 04, 2024 | 6:47 PM

Share

పేరుకు మలయాళ నటుడు అయినప్పటికీ మమ్ముట్టికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అందుకే యాత్ర లాంటి సినిమాల్లో మెయిన్‌ లీడ్‌ పోషించి తెలుగు ఆడియెన్స్‌ను అలరించారీ మలయాళ మెగాస్టార్‌. సాధారణంగా వయసు పెరిగే కొద్ది సినిమా సక్సెస్‌ రేట్‌ కూడా తగ్గుతుంది. అయితే మమ్ముట్టి విషయంలో మాత్రం ఇది రివర్స్‌. గత రెండేళ్లుగా ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్‌ హిట్లే. భీష్మపర్వం, దీ ప్రీస్ట్, సీబీఐ5: ది బ్రెయిన్‌, పుజు, రోస్‌చాక్‌, నాన్‌పకాల్‌ నేరతు మాయక్కం, క్రిస్టోఫర్‌, కన్నూర్‌ స్క్వాడ్‌.. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్నారు మమ్ముట్టి. థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మెగాస్టార్‌ సినిమాలకు మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా తెలుగులో ఆయన సినిమాలకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టి నటించిన తాజా చిత్రం ‘కాదల్‌ – ది కోర్‌’. జో బేబీ తెరకెక్కించిన ఈ ఎమోషనల్‌ డ్రామాలో జ్యోతిక హీరోయిన్‌గా నటించింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై ఎన్నో వివాదాలు తలెత్తాయి. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా మమ్ముట్టి సినిమా ఉందంటూ కువైట్‌, ఖతార్‌ దేశాలు కాదల్‌ ది కోర్‌ మూవీపై నిషేధం విధించాయి. మన దేశంలోనూ విమర్శలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ తట్టుకుని మరీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందీ ఎమోషనల్‌ డ్రామా. నవంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ది కాదల్‌ కోర్‌ ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేయడం విశేషం.

థియేటర్లలో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన మమ్ముట్టి సినిమా అప్పుడే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. గురువారం (జనవరి 04) అర్ధరాత్రి నుంచే ది కాదల్‌ కోర్‌ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్‌ భాషల్లోనూ మమ్ముట్టి మూవీ అందుబాటులో ఉంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. అదేంటంటే.. ప్రస్తుతానికి రెంటల్‌ విధానంలో మాత్రమే ది కాదల్‌ కోర్‌ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా ప్రసారం చేయనుంది.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ అందుబాటులోకి..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

కాదల్ ది కోర్ మూవీ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా