Salaar Movie : సలార్ వేట ఇప్పట్లో ఆగేలా లేదుగా .. 16 రోజులకు ఎంత వసూల్ చేసిందంటే
కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తన యాక్షన్ తో అదరగొట్టారు. సలార్ సినిమా రెండు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో మరోసారి నిరూపించాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతోసాలిడ్ హిట్ అందుకున్నారు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ‘హోంబలే ఫిలింస్’ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తన యాక్షన్ తో అదరగొట్టారు. సలార్ సినిమా రెండు పార్ట్ లు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ పార్ట్ వన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా ఇప్పటికి కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. తొలి రోజే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికీ కొని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతుంది సలార్.
ఇక సలార్ సినిమా 16కలెక్షన్స్ విషయానికొస్తే.. నైజాం 70.53 కోట్లు, సీడెడ్ 21.24 కోట్లు, ఉత్తరాంధ్ర 16.74 కోట్లు, ఈస్ట్ 9.52 కోట్లు, వెస్ట్ 6.98 కోట్లు, గుంటూరు 9.13 కోట్లు, కృష్ణా 7.18 కోట్లు, నెల్లూరు 4.67 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 145.99 కోట్లు, కర్ణాటక 22.10 కోట్లు, తమిళనాడు 11.20 కోట్లు, హిందీ 60.17 కోట్లు, కేరళ 6.73 కోట్లు, ఓవర్సీస్ 63.95 కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా రూ.315.94 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.22.06 కోట్ల షేర్ ని వసూల్ చేయాల్సి ఉంది.
A huge shoutout to ‘NI Animation’ for a fantastic video on #Salaar! The composition and love you’ve poured into it are incredible. Thank you ❤️https://t.co/J9TLF2Bj22
— Salaar (@SalaarTheSaga) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి