Guntur Kaaram: గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్ అయ్యిందా..?

అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మహేష్ బాబు నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Guntur Kaaram: గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్ అయ్యిందా..?
Gunturukaaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 07, 2024 | 7:06 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మహేష్ బాబు నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మహేష్ బాబు సరసనా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. అయితే గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఉంటుందని అభిమానులంతా ఆందోళ చెందుతున్నారు. అయితే గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గుంటూరులో జరపనున్నారని టాక్ వినిపిస్తుంది. జనవరి 9న గుంటూరు కారం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీని పై క్లారిటీ ఇస్తారని టాక్ వినిపిస్తుంది. గుంటూరు కారం సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేయనున్నారు.

గుంటూరు కారం ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి