GunturKaaram Trailer: బాబుదే ఈ పండగ రుబాబు.. రచ్చరేపిన గుంటూరు కారం ట్రైలర్
అతడు, ఖలేజా సినిమాలు థియటర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ టీవీలో మాత్రం ఈ సినిమాలకు మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాలు థియటర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ టీవీలో మాత్రం ఈ సినిమాలకు మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ అవతార్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గుంటూరు కారం సినిమా ట్రైలర్ రచ్చ లేపింది. మహేష్ బాబు ఈసారి మాస్ మసాలా హిట్ కొట్టబోతున్నారని తెలుస్తోంది. మహేష్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించనున్నాడు త్రివిక్రమ్. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చూపించారు. ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్, అయన డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.