AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: ట్యాగ్ మార్చుకున్నఎన్టీఆర్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఇక తాజాగా దేవర మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

Jr.NTR: ట్యాగ్ మార్చుకున్నఎన్టీఆర్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
Ntr
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2024 | 7:42 AM

Share

యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఇక తాజాగా దేవర మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న దేవర మూవీలో తారక్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే నిన్నటి వరకు యంగ్ టైగర్ అనే ట్యాగ్ తో తారక్ ఇప్పుడు ఆ ట్యాగ్ ను మార్చుకున్నారు. దేవర సినిమా టైటిల్ లో ఎన్టీఆర్ ట్యాగ్ మారింది. “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” అనే ట్యాగ్ తో రానున్నారు తారక్. ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో తారక్ మరో బ్లాక్ బస్టర్ హిట్ హిట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్